పుష్ప విలన్‌ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి! | Fahadh Faasil Dhoomam Movie OTT Release Date Ott | Sakshi

ఏడాది తర్వాత ఓటీటీలోకి పుష్ప విలన్‌ మూవీ.. ఎక్కడ? ఎప్పుడంటే?

Jul 6 2024 7:23 PM | Updated on Jul 6 2024 7:37 PM

Fahadh Faasil Dhoomam Movie OTT Release Date Ott

పుష్ప ఫేం ఫహద్‌ ఫాజిల్‌ హీరోగా నటించిన మలయాళ చిత్రం ధూమమ్‌. గతేడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ మిక్స్‌డ్‌ టాక్‌ రావడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. గతేడాది నవంబర్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ యాపిల్‌ టీవీలో ఈ ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. తాజాగా మరో ఓటీటీలోకి వచ్చేస్తోంది.

తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ధూమం విడుదల కానుంది. జూలై 11 నుంచి ప్రసారం కానుంది. అపర్ణ బాలమురళి, రోషన్‌ మాథ్యూ, పార్వతి నాయర్‌, దేవ్‌ మోహన్‌ కీలక పాత్రల్లో నటించారు. పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించాడు.

కథ విషయానికి వస్తే..
ఓ సిగరెట్‌ కంపెనీలో అవినాష్‌ (ఫహద్‌ ఫాజిల్‌) సేల్స్‌మెన్‌గా పని చేస్తుంటాడు. ఓ అపరిచితుడి కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. అతడు చెప్పిందిచేయకపోతే అవినాష్‌ భార్య దియా (అపర్ణ బాలమురళి)ను చంపేస్తానంటాడు. ఆ అపరిచితుడు ఎవరు? అవినాష్‌తో ఏం పని చేయించాడు? అనేది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే!

 

 

చదవండి: ఓటీటీలు చేతులెత్తేస్తున్నాయి.. ప్రతి సినిమా తీసుకోవట: తాప్సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement