Pushpa Fight Scene: This Action Sequence Will Be Next Level Says Sukumar And DSP - Sakshi
Sakshi News home page

పుష్ప: హాలీవుడ్‌ తరహాలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌..

Published Thu, Feb 11 2021 10:56 AM | Last Updated on Thu, Feb 11 2021 12:48 PM

Fight Sequence In Pushpa Inspired From Hollywood Movie - Sakshi

‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్‌ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌గా మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడు. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మిస్తునన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘పుష్ప’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు చెందిన ఓ విషయం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. 

పుష్పలో కోసం సుకుమార్‌ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. హాలీవుడ్‌లో మంచి విజయాన్ని సాధించిన ‘ది బ్రౌన్ లెగసీ’ని స్ఫూర్తిగా తీసుకుని ‘పుష్ప’లో రెండు భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెన్స్‌లో భాగంగా బన్నీ తోడేళ్లతో ఫైట్‌ చేయనున్నారట. యాక్షన్‌ సన్నివేశం కోసం దాదాపుగా పాతిక మంది హాలీవుడ్‌ టెక్నీషియన్స్ ను రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది. ఈ ఫైట్‌ సీక్వెన్స్‌లు సినిమా మొత్తానికే హైలెట్‌గా నిలవనున్నాయని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. కాగా ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న బన్నీ.. హాలీడే కోసం కుటుంబంతో కలిసి దుబాయ్‌కు వెళ్లారు. ఆయన టూర్‌ నుంచి రాగానే కేరళలో మరో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది.
చదవండి: పుష్ప రిలీజ్‌ డేట్‌పై సుకుమార్‌ అసంతృప్తి!
రౌడీ ఫ్యాన్‌కు గుడ్‌ న్యూస్‌..‘లైగర్’వచ్చేస్తున్నాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement