ఓటీటీల్లో భాషతో సంబంధం లేకుండా అందరూ సినిమాలు తెగ చూసేస్తున్నారు. దీనితోపాటు ప్రతివారం థియేటర్లలో కొత్త మూవీస్ రిలీజ్ కావడం లేటు.. వాటి టాక్ ఏంటి? ఒకవేళ బాగోలేకపోతే ఓటీటీల్లోకి ఎప్పుడొస్తాయి అని మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం థియేటర్లలో వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఓ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఇప్పుడు స్వయంగా దర్శకుడే క్లారిటీ ఇచ్చేశాడు. అది కాస్త కన్ఫ్యూజ్ చేస్తోంది.
సినిమా టాక్ ఏంటి?
2001లో 'గదర్' సినిమా రిలీజ్ అద్భుతమైన టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ సాధించింది. దానికి 22 ఏళ్ల సీక్వెల్ తీసి, ఈ మధ‍్యే రిలీజ్ చేయగా ఇప్పుడు కూడా బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చింది. ఇప్పటివరకైతే దాదాపు రూ.450 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. కెరీర్ అయిపోయిందనుకున్న సన్నీ డియోల్ కి ఈ సినిమా మంచి జోష్ తీసుకొచ్చింది. నార్త్ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఎగబడి మరీ చూస్తుండటం విశేషం.
(ఇదీ చదవండి: 'జైలర్'ని కోర్టు మెట్లు ఎక్కించిన ఆర్సీబీ)
ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు అనిల్ శర్మ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. అలానే ఓటీటీ రిలీజ్ గురించి స్పందించారు. 'ప్రస్తుతం ప్రేక్షకులు 'గదర్ 2'ని థియేటర్లలో చూసేందుకు ఇష్టపడుతున్నారు. నాకు తెలిసినంతవరకు మరో ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుందని అనుకుంటున్నాను' అని అనిల్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఆరు నెలలు.. కుదరదేమో?
అయితే 'గదర్ 2' హిట్ అయిన ఆనందంలో ఉన్న దర్శకుడు అనిల్ శర్మ.. ఓటీటీ రిలీజ్ ఆరు నెలల తర్వాత అన్నాడు. కానీ అన్ని నెలలు ఎవరూ వెయిట్ చేయరు. అలానే డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న జీ5.. అంతకాలం అస్సలు సినిమాని దాచిపెట్టుకోదు కదా. దీన్నిబట్టి చూస్తుంటే.. ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. 5-6 వారాల తర్వాత అనుకున్నాసరే సెప్టెంబరు చివరికల్లా 'గదర్ 2' ఓటీటీలోకి వచ్చేయొచ్చు.
(ఇదీ చదవండి: మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!?)
Comments
Please login to add a commentAdd a comment