
హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు ఈ మధ్య పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు ప్రేమించి చేసుకుంటే.. మరికొందరు పెద్దల చూపించిన అబ్బాయితో ఏడడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో యంగ్ హీరోయిన్ చేరింది. కుర్రాళ్ల ఫేవరెట్ అయిన ఈ భామ.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా రహస్యంగా పెళ్లి చేసేసుకుంది. ఆ విషయం ఇప్పుడు బయటపడింది.
(ఇదీ చదవండి: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్)
తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకున్న మీతా రఘునాథ్.. గతేడాది 'గుడ్ నైట్' చిత్రంతో హిట్ కొట్టింది. అంతకు ముందు 'ముదల్ నీ ముదువమ్ నీ' చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. ఈమె క్యూట్ యాక్టింగ్‌కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. అలాంటిది గతేడాది నవంబరులో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది.
ఇప్పుడు తన స్వస్థలమైన ఊటీలో పెళ్లి కూడా చేసేసుకుంది. ఎప్పుడు జరిగిందనే తేదీతో పాటు వరుడు వివరాలు కూడా అస్సలు బయటపెట్టలేదు. కానీ పెళ్లి ఫొటోల్ని ఓ నాలుగింటిని పోస్ట్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే కుర్రాళ్లు.. తమ ఫేవరెట్ బ్యూటీకి పెళ్లయిపోయిందని బాధపడుతుండగా, తోటీ నటీనటులు మాత్రం శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్)
Comments
Please login to add a commentAdd a comment