Stylish Star Allu Arjun Pushpa Movie Still Photographer Died In Shooting - Sakshi
Sakshi News home page

‘పుష‍్ప’ షూటింగ్‌లో విషాదం : షాక్‌లో అభిమానులు 

Published Fri, Jan 29 2021 9:57 AM | Last Updated on Fri, Jan 29 2021 12:36 PM

Hero Allu arjun pushpa movie still photographer srinivas passed away - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా మూవీ 'పుష్ప’ షూటింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ స్టిల్ ఫొటోగ్రాఫర్‌ జీ శ్రీనివాస్ (54) గురువారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో జరుగుతున్న క్రమంలో మూవీకి స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో యూనిట్ వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలొదిలారు.

పుష్ఫ మూవీ ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన మరుసటి  చోటు చేసుకున్న ఈ హఠాత్పరిణామంతో అటు అల్లు అర్జున్‌ అభిమానులు, ఇటు యూనిట్‌ అంతా తీరని విషాదంలో మునిగిపోయింది. శ్రీనివాస్‌ మృతి పట్ల ‘పుష్ప’ టీమ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా దాదాపు 200 పైగా సినిమాలకు పనిచేసిన శ్రీనివాస్‌ స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా పని చేశారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలున్నారు. డైరెక్టర్ సుకుమార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో, గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement