సినిమా కావాలంటే తనను మర్చిపోమంది.. హీరో బ్రేకప్‌ స్టోరీ.. | Hero Kartik Aaryan Recalls His Biggest Heartbreak in College Life | Sakshi
Sakshi News home page

Kartik Aaryan: హీరోనవుతానన్నా.. బ్రేకప్‌ చెప్పింది.. అందరూ రిజెక్ట్‌ చేశారు!

Published Mon, Jul 15 2024 4:24 PM | Last Updated on Mon, Jul 15 2024 4:40 PM

Hero Kartik Aaryan Recalls His Biggest Heartbreak in College Life

పరిచయాలు లేకపోతే పనయ్యేలా లేదు. ఎక్కడైనా ఇదే పరిస్థితి! సినిమా ఇండస్ట్రీలోనూ ఇంతే.. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా, ఎవరితోనూ పరిచయాలు లేకుండా సినిమాల్లోకి రావాలంటే ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకోవాల్సిందే! బాలీవుడ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ అందరిలాగే ఇబ్బందులు పడ్డాడు. సినిమాలకు పనిరాడని ముఖం మీదే అన్నారు.

బ్రేకప్‌
అయినా పట్టుదలతో ప్రయత్నించి ఇప్పుడు హీరోగా నిలదొక్కుకున్నాడు. తాజాగా అతడు బి ఎ మ్యాన్‌, యార్‌ అనే పాడ్‌కాస్ట్‌కు హాజరయ్యాడు. ఈ పాడ్‌కాస్ట్‌లో కార్తీక్‌ ఆర్యన్‌ మాట్లాడుతూ.. కాలేజీలో ఓ అమ్మాయిని చూసి స్మైల్‌ ఇచ్చేవాడిని. నా ఫీలింగ్స్‌ నేరుగా చెప్పేంత ధైర్యం లేకపోయేది. తర్వాత కొన్నాళ్లకు ఎలాగోలా మేము కలిసిపోయాం. కానీ ఒకరోజు ఆమె బ్రేకప్‌ చెప్పింది. నీకు యాక్టింగే కావాలంటే నన్ను మర్చిపో. ఒక నటుడి జీవితాన్ని నేను హ్యాండిల్‌ చేయలేను అని ముఖం మీదే చెప్పేసింది.

రిజెక్ట్‌ చేశారు
చాలా బాధపడ్డాను. ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు కూడా ఎన్నోసార్లు రిజెక్ట్‌ చేశారు. ఎందుకు బతికున్నానా? అనిపించేది. ఫ్రస్టేషన్‌ వచ్చేది. కానీ నెమ్మదిగా కెరీర్‌లో ముందుకు వెళ్లాను. నాకంటూ అభిమానుల్ని సంపాదించుకున్నాను. వాళ్లే నా ఒంటరితనాన్ని పోగొట్టారు. అవుట్‌సైడర్‌గా మాత్రం కష్టాలు పడ్డాను అని చెప్పుకొచ్చాడు.

చదవండి: ఓటీటీలో 'సుధీర్‌ బాబు' సినిమా.. నేడు సాయంత్రం నుంచే స్ట్రీమింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement