
మొదట్లో మెరుగ్గా రాణిస్తుందనుకున్న రతిక రోజ్.. ఊహించని ప్రవర్తనతో, కుటిల బుద్ధి చూపించడంతో సడన్‌గా ఎలిమినేట్ అయిపోయింది. అది ఆమెకు పాఠమైతే.. వెన్నుపోట్లు ఎంత ప్రమాదకరమో
బిగ్‌బాస్ హౌస్.. ఒక పాఠశాల. ఇందులో వయసు, వృత్తితో సంబంధం లేకుండా ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. కొందరు పాఠాలు నేర్చుకుంటారు, మరికొందరు గుణపాఠంగా మిగులుతుంటారు. ఈ సీజన్‌లోనూ అదే జరిగింది. మొదట్లో మెరుగ్గా రాణిస్తుందనుకున్న రతిక రోజ్.. ఊహించని ప్రవర్తనతో, కుటిల బుద్ధి చూపించడంతో సడన్‌గా ఎలిమినేట్ అయిపోయింది. అది ఆమెకు పాఠమైతే.. వెన్నుపోట్లు ఎంత ప్రమాదకరమో, ఎలా ప్రవర్తిస్తే జనాలు తీవ్రంగా ఖండిస్తారో, అసలు ఒక అమ్మాయి ఎలా ఉండకూడదో ఆమెను చూసి నేర్చుకోవచ్చని.. తన జర్నీ ఒక గుణపాఠమని నెటిజన్లు భావిస్తున్నారు.
ఒక గంట ఎపిసోడ్ చూసి ఆమె తప్పు చేసిందని, ముమ్మాటికీ ఆమెది తప్పేనని ముద్ర వేస్తున్నారు. అక్కడివరకు ఆగిపోతే సరి, కానీ నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది ఎక్కడిదాకా వెళ్లిందంటే హీరో కిరణ్ అబ్బవరం వరకు! కిరణ్ ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రూల్స్ రంజన్. ఈ మూవీ అక్టోబర్ 6న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఎక్స్(ట్విటర్)లో అభిమానులతో ముచ్చటించాడు. కొందరు సరదా ప్రశ్నలు వేస్తే మరికొందరు దొరికిందే ఛాన్సని సెటైర్లు కూడా వేస్తున్నారు. అన్నింటికీ ఓపికగా సమాధానాలు, కౌంటర్లు ఇచ్చుకుంటూ పోతున్నాడు.
ఈ క్రమంలో ఓ నెటిజన్.. రూల్స్ రంజన్ హిట్ అయ్యాక నీకు రతిక లాంటి అమ్మాయితో పెళ్లవ్వాలని కోరుకుంటున్నా.. ఆల్ ద బెస్ట్ అని చెప్పాడు. దీనికి కిరణ్ స్పందిస్తూ.. ఎందుకమ్మా నామీద నీకంత పగ.. పెళ్లయితే చేసుకుందాం.. కానీ, ఎలాంటి అమ్మాయి వస్తుందో చూద్దాం.. అని రిప్లై ఇచ్చాడు. 'హీరోలా ఉన్నావ్ అన్నా' అన్న కామెంట్‌కు హీరోలా లేకపోయినా పర్లేదు, మీలో ఒకడిలా ఉంటే చాలు అని కౌంటర్ ఇచ్చాడు.
#AskKiranAbbavaram #RulesRanjann https://t.co/Pvxflik5oe pic.twitter.com/edZXIvyeoV
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 3, 2023
#Askkiranabbavaram #RulesRanjann https://t.co/JfFvmxmPrR pic.twitter.com/AOiaLfM8pJ
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 3, 2023
చదవండి: నిర్మాతను మోసం చేసిన డైరెక్టర్.. చివరి రోజుల్లో వైద్యానికి డబ్బుల్లేక..