Vishal 31 Movie: Not A Common Man Vishal Movie Shooting Starts In Hyderabad - Sakshi
Sakshi News home page

Vishal31 : మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేసిన విశాల్‌

Published Tue, Jun 15 2021 11:17 AM | Last Updated on Tue, Jun 15 2021 1:01 PM

Hero Vishal Kick Starts Shooting His Next Film In Hyderabad - Sakshi

కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుతుండటంతో నటీనటులంతా మళ్లీ బ్యాక్‌ టూ వర్క్‌ అంటున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. తాజాగా ఆ లిస్ట్‌లో తమిళ స్టార్‌ హీరో విశాల్‌ కూడా చేరారు. విశాల్‌31వ చిత్రం ‘నాట్ ఏ కామ‌న్ మేన్‌’ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఇందుకు సంబంధించిన చిత్రకరణ మొదలయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా విశాల్‌ తెలియజేశారు.

కోవిడ్‌ నిబంధనల్ని పాటిస్తూ హైదరాబాద్‌లో లాంగ్‌ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశామని, జూలై నెలాఖరులోగా షూటింగ్‌ పూర్తవుతుందని పేర్కొన్నాడు. ఈ మేరకు తన 31వ సినిమాకు సంబంధించి మేకింగ్‌ వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఇక  చిత్రం ద్వారా టీపీ.శరవణన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అధికార బలం కలిగిన వ్యక్తిని ఎదిరించి ఒక సామాన్యుడి కథే ఈ చిత్రం. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. 

చదవండి : హీరో విశాల్, ఆర్‌బీ చౌదరికి సమన్లు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement