టాలీవుడ్‌లో మెగా ఛాన్స్‌పై గురిపెట్టిన హనీరోజ్‌ | Honey Rose Got Chance In Chiranjeevi Movie | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లో మెగా ఛాన్స్‌పై గురిపెట్టిన హనీరోజ్‌

Jan 30 2024 7:58 AM | Updated on Jan 30 2024 8:49 AM

Honey Rose Got Movie Chance With Chiranjeevi - Sakshi

బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌లో క్రేజీ గుర్తింపు తెచ్చుకున్న హనీరోజ్‌ యూత్‌ గుండెళ్లో గ్లామర్‌ ముద్ర వేశారు. తన గ్లామర్‌తో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ మలయాళ బ్యూటీ ఇప్పటి వరకు మరే సినిమాకు సైన్‌ చేయలేదు. కానీ తన సోషల్‌ మీడియా  ద్వారా టచ్‌లో ఉంటుంది. రెగ్యూలర్‌గా మాల్స్‌ ఓపెనింగ్స్‌ కార్యక్రామల్లో కనిపిస్తూ వాటికి సంబంధించి గ్లామర్ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ మెప్పిస్తుంది. ‘వీరసింహారెడ్డి’ ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఆమెకు చాలా సినిమా అవకాశాలు వచ్చినా అవన్నీ అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం కావడంతో చాలా వరకు రిజెక్ట్‌ చేసింది. 

కొద్దిరోజుల క్రితం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘రాచెల్’లో హనీరోజ్‌నే  ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. అందులో ఆమె మాస్‌ రోల్‌ పోసిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ అయితే పెద్దగా రాలేదు.

టాలీవుడ్‌లో మరోక సినిమాలో హనీరోజ్‌ కనిపిస్తే బాగుండు అనుకునే ఫ్యాన్స్‌కు ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. వీర సింహారెడ్డి తర్వాత  తెలుగులో ​ ఓ సినిమాకు హనీరోజ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్‌ అవుతుంది. ఆమెకు ఈసారి ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవితో నటించే ఛాన్స్‌ అందుకుందని ప్రచారం జరుగుతుంది. డైరెక్టర్‌ వశిష్ఠ- చిరంజీవి కాంబినేషన్‌లో సోషియో ఫాంటసీ చిత్రంగా 'విశ్వంభర' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. విజువల్‌ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నారని వార్తలు వచ్చాయి.త్రిష, అనుష్క, కాజల్​, నయనతార పేర్లు ప్రధానంగా వినిపించాయి. ప్రస్తుతం కొత్తగా హనిరోజ్ పేరు తెరపైకి వచ్చింది. ప్రచారం జరుగుతున్న ఈ విషయంపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇస్తేకానీ అసలు విషయం ఎంటో తెలియదని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement