Actress Honey Rose Reacts To Trolls And Rumours About Surgery For Beauty, Deets Inside - Sakshi
Sakshi News home page

Honey Rose Surgery Rumours: అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు సర్జరీ? స్పందించిన హీరోయిన్‌

Published Wed, Jul 26 2023 10:04 AM | Last Updated on Wed, Jul 26 2023 10:21 AM

Honey Rose Respond on Surgery Rumours - Sakshi

హీరోయిన్లకు అందం చాలా ముఖ్యం. ఇందుకోసం కొందరు శస్త్ర చికిత్స చేసుకోవడానికి కూడా వెనుకాడరు. తమ అందాలను సర్జరీల ద్వారా మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటారు. హీరోయిన్‌ హనీరోజ్‌ కూడా శస్త్ర చికిత్సతో తన అందాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. ఈ మలయాళీ భామ 14 వయదిల్‌ బాయ్‌ఫ్రెండ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా 2004లో హీరోయిన్‌గా పరిచయమైంది.

అలా అక్కడ పలు చిత్రాల్లో నటిస్తూ తమిళంలో మొదలు కనవే, సింగం పులి, మల్లు కట్టు, గాంధర్వన్‌ తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికీ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈమె ఇటీవల బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 33 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉండడం విశేషం.

తాజాగా ఈ బ్యూటీ తన అందం గురించి జరుగుతున్న ట్రోలింగ్‌ పై స్పందించింది. హీరోయిన్‌గా గ్లామర్‌ రంగంలో అందాన్ని కాపాడుకోవడం అవసరమే కదా అని పేర్కొంది. అందుకోసం సౌందర్య సాధనాలను వాడుతుంటానని తెలిపింది. అయితే కొందరు ప్రచారం చేస్తున్నట్లు శస్త్ర చికిత్స మాత్రం చేయించుకోలేదని స్పష్టం చేసింది. నటిగా కొనసాగడం సాధారణ విషయం కాదని, తన అందం అనేది భగవంతుడి సృష్టేనని హనీరోజ్‌ చెప్పుకొచ్చింది.

చదవండి: ఉపాసన డైమండ్‌ గిఫ్ట్‌? క్లారిటీ ఇచ్చిన తమన్నా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement