
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా సంగీత దర్శకుడు కోటి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని ‘ఇది చాలా బాగుందిలే..’ అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది.
ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘ఇది చాలా బాగుందిలే..’ పాటకు కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించగా, సిద్ శ్రీరామ్ పాడారు. ‘‘యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘సెహరి’. సిమ్రాన్‌పై హర్ష్ తన లవబుల్ ఫీలింగ్‌ను చెప్పే క్రమంలో ‘ఇది చాలా బాగుందిలే’ పాట వస్తుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment