ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఇళయరాజా అన్నయ్య కొడుకు పావలర్ శివన్ (60) మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఇళయరాజా అన్నయ్య పేరు పావలర్ వరదరాజన్. ఈయన గాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు, నాటక రచయిత.. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆరంభ కాలంలో ఇళయరాజా ఎదుగుదలలో ఈయన పాత్ర ఉంది.
పావలర్ వరదరాజన్ 1973లో కన్నుమూశారు. ఈయన ఇద్దరు కొడుకులు ఒకరు 2020లో కిడ్నీ సమస్య కారణంగా మరణించారు. కాగా మరో కొడుకు పావలర్ శివన్. ఈయన గిటార్ వాయిద్య కళాకారుడు. ఇళయారాజా సంగీత బృందంలోనే కొనసాగుతూ వచ్చారు. పావలర్ శివన్ రెండు మూడు చిత్రాలకు సంగీత దర్శకుడుగా కూడా పని చేశారు. ఈయన కుటుంబ సభ్యులతో కలిసి పాండిచ్చేరిలో నివసిస్తున్నారు.
కాగా మంగళవారం వేకువజామున అనూహ్యంగా గుండెపోటు కారణంగా మంచంపై నుంచి కిందకి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతికి సంగీత దర్శకులు, పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
చదవండి: కమల్, వాణి గురించి చెప్పినా శ్రీవిద్య వినలేదు, పాపం!
Comments
Please login to add a commentAdd a comment