విజయ్‌తో సినిమా ఆఫర్‌.. రిజెక్ట్‌ చేసిన లవ్‌ టుడే బ్యూటీ | Actress Ivana Missed Chance To Act With Actor Vijay, Know Reason Inside - Sakshi
Sakshi News home page

Ivana: విజయ్‌ సినిమాలో ఛాన్స్‌.. నో చెప్పిన హీరోయిన్‌!

Published Wed, Dec 6 2023 8:25 AM | Last Updated on Wed, Dec 6 2023 10:50 AM

Ivana Missed to Act with Vijay - Sakshi

బాలా దర్శకత్వం వహించిన నాచ్చియార్‌ చిత్రంలో జీవీ ప్రకాష్‌ కుమార్‌ ప్రేమికురాలిగా నటించి వెలుగులోకి వచ్చిన హీరోయిన్‌ ఇవానా. ఆ తరువాత ప్రదీప్‌ రంగనాథన్‌ సరసన లవ్‌ టుడే చిత్రంలో నటించింది. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. దీంతో ఇవానా యూత్‌ ఫేవరెట్‌ హీరోయిన్‌గా మారిపోయింది. తర్వాత అమ్మడికి వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. అలా హరీష్‌ కల్యాణ్‌ కు జంటగా ఎల్‌ జీఎం చిత్రంలో నటించింది. ఎంఎస్‌ ధోనీ నిర్మించిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు.

అదే సమయంలో ఇవానా అధిక పారితోషికం డిమాండ్‌ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో అవకాశాలు తిరుగు ముఖం పట్టినట్లు టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవానాకు హీరో విజయ్‌తో కలిసి నటించే లక్కీ ఛాన్స్‌ వచ్చింది. విజయ్‌ ప్రస్తుతం తన 68వ చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఇందులో హీరోయిన్‌ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. నటి స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, యోగిబాబు, ప్రేమ్‌ జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఇందులో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.

ఇందులో నటి ఇవానాకు నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ అవకాశాన్ని ఇవానా జారవిడుచుకుంది. కారణం ఆ చిత్రంలో విజయ్‌కు చెల్లెలిగా నటించే అవకాశం కావడమే. ఈ చిత్రంలో చెల్లెలు పాత్రలో నటిస్తే ఆ తరువాత అలాంటి పాత్రలోకి పిలుస్తారనే భయంతోనే ఈ ఆఫర్‌ వదులుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద విజయ్‌తో నటించే అవకాశాన్ని ఈ అమ్మడు వదులు కోవడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

చదవండి: కాలర్‌ ఎగరేసుకుని బయటకు వస్తారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement