
20 ఏళ్లుగా విలక్షణ నటుడు జగపతిబాబు అభిమానిగా ఉన్న శ్రీను గుంటూరులో కరోనాతో ప్రాణాలు విడిచాడు. ఈ విషయం తెలిసి కలత చెందిన జగపతిబాబు సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని తెలియజేశాడు. తన అభిమాన సంఘం గుంటూరు ప్రెసిడెంట్‌గా ఉన్న శ్రీను కరోనాతో కన్నుమూయడం బాధాకరమన్నాడు. శ్రీను, అతడి భార్య కోటీశ్వరిగారు వారి సంతానంలో ఒకరికి జగపతి అని తన పేరే పెట్టారని ఉద్వేగానికి లోనయ్యాడు.
ఈ కుటుంబానికి ఎప్పటికీ తన అండ ఉంటుందని భరోసానిచ్చాడు. శ్రీనును చాలా మిస్ అవుతున్నానంటూ మనసులోని బాధను బయటపెట్టాడు. కరోనా వల్ల కళ్ల ముందే ఎంతోమంది చనిపోతున్నారని, ఎవరు ఎప్పుడు మరణిస్తారో తెలియలేని దుస్థితిలో ఉన్నామని తెలిపాడు. కాబట్టి ఇప్పటికైనా అందరూ మాస్క్‌లు పెట్టుకుంటూ, శానిటైజ్ చేసుకోవాలని కోరాడు. కాగా ప్రస్తుతం జగపతిబాబు 'అన్నాత్తే', 'మహా సముద్రం' సహా పలు సినిమాల్లో నటిస్తున్నాడు.
చదవండి: సినిమాల్లోకి రంభ రీఎంట్రీ.. ఫొటోలు, ఫ్లెక్సీలతో హల్‌చల్!
Comments
Please login to add a commentAdd a comment