దేవర భామ స్పై యాక్షన్ థ్రిల్లర్‌.. టీజర్ చూశారా! | Janhvi Kapoor plays diplomat in Sudhanshu Saria's spy action-thriller | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: దేవర భామ స్పై యాక్షన్ థ్రిల్లర్‌.. టీజర్ అదిరిపోయింది!

Published Wed, Apr 17 2024 2:00 PM | Last Updated on Wed, Apr 17 2024 2:40 PM

Janhvi Kapoor plays diplomat in Sudhanshu Saria spy action thriller - Sakshi

దేవర మూవీతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్‌ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా జాన్వీ ప్రధాన పాత్రలో తెరెకక్కుతోన్న తాజా చిత్రం ఉలజ్‌. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ విదేశీ రాయబారి పాత్రలో కనిపించనుంది. సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. టీజర్ చూస్తే స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో గూఢచర్యంపై కథాంశంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాతో యాక్షన్ అవతార్‌లోకి అడుగు పెట్టింది. 

కాగా.. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిల్ హుస్సేన్, రాజేష్ తైలాంగ్, మెయాంగ్ చాంగ్, రాజేంద్ర గుప్తా, జితేంద్ర జోషి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. జంగిల్ పిక్చర్స్‌ పతాకంపై వినీత్ జైన్ నిర్మించిన ఈ చిత్రం జూలై 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ యాక్షన్ జోనర్‌లో అడుగు పెట్టింది. 

కాగా.. టాలీవుడ్‌లో కొరటాల డైరెక్షన్‌లో వస్తోన్న దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌ సరసన కనిపించనుంది. ఆ తర్వాత రామ్ చరణ్‌తోనూ జతకట్టనుంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఆర్సీ16లో జాన్వీ హీరోయిన్‌గా నటించనుంది. అంతే కాకుండా బాలీవుడ్‌లోనూ కరణ్‌ జోహార్‌ మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహి షూటింగ్‌ ఇటీవలే పూర్తి చేసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement