రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. విడుదలైన అన్ని భాషల్లో ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రీసెంట్ ఈ సినిమాను జపాన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 21న జపాన్ వ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్ మూవీ రిలీజ్ అయ్యింది. ఇక ఈమూవీ ప్రమోషన్లో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్ టీం అక్కడి పయమైన సంగతి తెలిసిందే.
చదవండి: దీపావళి సందర్భంగా కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్
సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు, రాజమౌళిలు కుటుంబంతో సహా జపాన్‌లో వాలిపోయారు. ఈ క్రమంలో జపాన్ అంత పర్యటిస్తూ ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తున్నారు చరణ్, తారక్‌లు. ఈ సందర్భంగా జపాన్ ప్రజలు చూపిస్తున్న అభిమానికి వారు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే చరణ్, తారక్ మాట్లాడుతుండగా అక్కడి వారంత అత్యూత్సాహం చూపించడం, భావోద్వేగడానికి లోనైన పలు ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. తాజాగా మరో ఆసక్తికర వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ స్పీచ్ ఇస్తుంటే జపాన్ ప్రేక్షకులంతా భావోద్వేగానిక లోనవుతూ కన్నీటి పర్యంతరం అయ్యారు. షోకి ముందు ఓ ఆడిటోరియంలో చరణ్ జపాన్ ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడాడు.
చదవండి: నన్ను అల అనడంతో మేకప్ రూంకి వెళ్లి ఏడ్చా: నటి ప్రగతి
‘మీ చూపిస్తున్న ప్రేమ, అభిమానికి మేం ఆశ్చర్యపోతున్నాం. ఇంతలా మా సినిమాను, మమ్మల్ని ఆదరిస్తున్న మీకు కృతజ్ఞతలు. మాపై మీరు చూపిస్తున అభిమానానికి కృతజ్ఞతలు. తారక్ చెప్పినట్లు నిజంగా ఇది మా ఇంటిని తలపిస్తోంది. మీరంత మమ్మల్ని మీ కుటుంబంలా ఆదరిస్తున్నారు. ఇది నిజంగా భావోద్వేగానికి గురి చేస్తోంది. నేను మాట్లాడుతుంటే కూడా కొందరు ఎమోషనల్ రియాక్షన్ ఇస్తుండటం చూస్తుంటే నిజమైన ప్రశంసగా భావిస్తున్నాను. ఇంతటి ప్రేమను నేను జపాన్ నుంచి తీసుకువెళుతున్నాను’ అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇక చరణ్ మాట్లాడుతుండగా అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా భావోద్వేగానికి గురవుతూ కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. దీనిపై ఫ్యాన్స్, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Mega Star @AlwaysRamCharan gave the most heartwarming and emotional speech while addressing an auditorium of #Japanese fans.
— Free Press Journal (@fpjindia) October 23, 2022
He spoke about how endearing the love and support from the Japanese fans has been and how he feels like he is on homeland #RamCharanInJapan #RRR pic.twitter.com/YppHo7Rvno
Comments
Please login to add a commentAdd a comment