Jr NTR Gets Surprise From Japan Hotel Staff Ahead RRR Release, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Jr NTR: జపాన్‌లో తారక్‌కు అరుదైన స్వాగతం, వీడియో వైరల్‌

Published Thu, Oct 20 2022 4:13 PM | Last Updated on Thu, Oct 20 2022 5:41 PM

Jr NTR Surprised When Japan Hotel Staff Give Letter Video Goes Viral - Sakshi

ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీం జపాన్‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. రేపు(అక్టోబర్‌ 21న)ఈ చిత్రం జపాన్‌ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తారక్‌, రామ్‌ చరణ్‌ తమ కుటుంబ సభ్యులతో కలిసి జపాన్‌లో వాలిపోయారు. అలాగే జక్కన్న ఇతర మూవీ టీం సభ్యులు కూడా జపాన్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో దిగిన తారక్‌కు అరుదైన స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ వీడియోలో హోటల్‌ మహిళా స్టాఫ్‌ ఒకరు తారక్‌ దగ్గరికి వచ్చి ఓ లేఖను అందించింది.

చదవండి: దీపాల వెలుగులు.. బాలీవుడ్‌ తారల మెరుపులు

అది చూసిన ఎన్టీఆర్‌ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఓ మై గాడ్‌ ఇక్కడ చాలా మంది ఉన్నారంటూ షాకయ్యాడు. అయితే ఆ లేటర్‌పై థ్యాంక్యూ అని రాసి ఉంది. దానిని హోటల్‌కు సంబందించిన సిబ్బంది అంత కలిసి ఇచ్చారని ఆమె చెప్పడంతో తారక్‌ ఫిదా అయ్యాడు. ఈ వారందరి తరపు ఆ లేటర్‌ తారక్‌ అందించి సదరు మహిళా స్టాఫ్‌ ఆ లేటర్‌ తానే రాశానని చెప్పడంతో ఎన్టీఆర్‌ ఆమెకు తిరిగి ధన్యవాదాలు తెలిపాడు. సో స్వీట్‌ ఆఫ్‌ యూ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించాడు. లేటర్‌పై ఉన్న పేర్లను చదివి ‘ఓ మై గాడ్‌ ఇక్కడ చాలామంది ఉన్నారు’ అంటూ షాకయ్యాడు. ప్రస్తుత్తం ఈ వీడియోలో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఇక జపాన్‌లో తారక్‌ క్రేజ్‌ చూసి నందమూరి అభిమానులంత మురిసిపోతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement