‘లేడీ సూపర్‌స్టార్‌’ ప్రశంసించిందంటూ మురిసిపోతున్న జాన్వీ | Jhanvi Kapoor Said Nayanthara Praises Her After Watching Good Luck Jerry | Sakshi
Sakshi News home page

Nayanthara-Jhanvi Kapoor: ‘లేడీ సూపర్‌స్టార్‌’ ప్రశంసించిందంటూ మురిసిపోతున్న జాన్వీ

Published Sat, Aug 6 2022 9:21 AM | Last Updated on Sat, Aug 6 2022 9:41 AM

Jhanvi Kapoor Said Nayanthara Praises Her After Watching Good Luck Jerry - Sakshi

దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ తాజాగా నటించిన చిత్రం గుడ్‌ లక్‌ జెర్రీ. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటించిన కొలమావు కోకిలకు చిత్రానికి రీమేక్‌ ఇది. జూలై 29న ఈ మూవీ డస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో రిలీజ్‌ అయ్యిన ఈ చిత్ర పాజిటివ్‌ టాక్‌ను తెచ్చుకుంటుంది. ఇందులో జాన్వీ నటనకు ఆడియన్స్‌ నుంచి మాత్రమే కాదు సినీ ప్రముఖుల నుంచి సైతం ప్రశంసలు అందుతున్నాయి. ఇదిలా ఉంటే మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల జాన్వీ ఓ చానల్‌తో ముచ్చటింది. ఈ సందర్భంగా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార తనపై ప్రశంసలు కురిపించిందంటూ ఆనందం వ్యక్తం చేసింది.

చదవండి: సమంతపై ఇప్పటికి గౌరవం ఉంది.. కానీ!: నాగ చైతన్య

‘‘గుడ్‌ లుక్‌ జెర్రీ ట్రైలర్‌పై నయనతార సానుకూలంగా స్పందించారని తెలిసింది. ఆమె నా నటనను ప్రశంసించారని చదివా. దీంతో తనకి థ్యాంక్స్‌ చెప్పాలని నంబర్ తెలుసుకుని మెసేజ్ చేశాను. నా మెసేజ్‌కి వెంటనే ఆమె ఇలా రిప్లై ఇచ్చారు. ‘కెరీర్ ప్రారంభంలోనే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషించినందుకు గర్వపడుతున్నా. కోకిల నా మనసుకు చాలా దగ్గరైన పాత్ర. గుడ్ లక్ జెర్రీ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించావు. గుడ్ లక్ జాన్వీ’ అంటూ మెసేజ్ చేశారు’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత ‘ఏకంగా లేడీ సూపర్‌ స్టార్‌ నన్ను ప్రశంసించడం మంచి అనుభూతిని ఇస్తుంది. తన ప్రశంస నాకు చాలా ప్రత్యేకం’ అంటూ తెగ సంబరపడిపోయింది జాన్వీ. 

చదవండి: రణ్‌వీర్‌ని ఫాలో అయిన నటి.. టాప్‌లెస్‌ ఫొటోతో రచ్చ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement