తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ | Jr NTR Approach To High Court For Land Issue | Sakshi
Sakshi News home page

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌

Published Fri, May 17 2024 9:25 AM | Last Updated on Fri, May 17 2024 10:56 AM

Jr NTR Approach To High Court For Land Issue

హైదరాబాద్‌, సాక్షి: టాలీవుడ్‌ అగ్రనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నగరంలో భూవివాదానికి సంబంధించిన ఆయన కోర్టులో పిటిషన్‌ వేశారు. వివరాల్లోకి వెళ్తే.. 

జూబ్లీహిల్స్‌‌ హౌసింగ్‌‌ సొసైటీలో ల్యాండ్‌కు సంబంధించిన వివాదంలో జూనియర్‌ ఎన్టీఆర్‌  తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.  జూబ్లీహిల్స్  రోడ్ నెంబర్ 75లో తనకు సంబంధించిన  ప్లాట్  విషయంలో వివాదం తలెత్తడంతో ఆయన కోర్టుకు వెళ్లారు. 2003లో గీత లక్ష్మీ అనే వ్యక్తి నుంచి ఒక ప్లాట్‌ను ఎన్టీఆర్ కొన్నారు. అయితే,ఆ ల్యాండ్‌పై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డీఆర్‌‌టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌‌) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ హైకోర్టును ఆశ్రయించారు.

1996లో ఆ ల్యాండ్‌ మీద పలు బ్యాంకుల వద్ద  ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా గీత లక్ష్మి కుటుంబం  లోన్స్ పొందింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌కు అమ్మే సమయంలో ఆ విషయాన్ని గీత లక్ష్మి దాచిపెట్టింది. ఫేక్‌ డాక్యుమెంట్స్ ద్వారా ఇదే ల్యాండ్‌ మీద ఐదు బ్యాంకుల నుంచి గీత లక్ష్మి లోన్స్ తీసుకుంది. కానీ, ల్యాండ్‌ అమ్మే సమయంలో కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్‌కు గీత లక్ష్మి  చెప్పింది. ఆ సమయంలో చెన్నైలోని ఒక బ్యాంక్‌లో లోన్ క్లియర్ చేసి ఆ డాక్యుమెంట్స్‌ను ఎన్టీఆర్‌ తీసుకున్నారు. 2003 నుంచి ఆ ప్లాట్ ఒనర్‌గా తారక్ ఉన్నారు.

అయితే 1996లోనే ఈ స్థలాన్ని తనఖా పెట్టి రుణం చెల్లించని కారణంగా ఆ ఆస్తిపై హక్కులు తమవేనని పేర్కొంటూ పలు బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. వీటిని రద్దు చేయాలంటూ  ఎన్టీఆర్‌ కోర్టును ఆశ్రయించారు. ల్యాండ్‌ విషయంలో సమగ్ర విచారణ చేయకుండానే డీఆర్‌‌టీ  (రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌‌) ఆదేశాలు ఇచ్చిందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. స్థలాన్ని అమ్మిన వారిపై కేసు పెట్టినట్లు తారక్‌‌ లాయర్‌‌ తెలిపారు. అయితే డాకెట్‌‌ ఆదేశాలు అందాల్సి ఉందని, కొంత సమయం ఇస్తే వాటి వివరాలు సమర్పిస్తామని చెప్పారు. జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement