
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు ఖరీదైన లగ్జరీ కార్లను వాడుతున్నారు. కొందరేమో తరచూ మారుస్తుంటారు. మార్కెట్‌లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు.. తమ వాకిట్లో ఉండాలనుకునేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. తమ అభిరుచి, హోదా, ట్రెండ్‌కి తగ్గ కార్లను విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్న స్టార్లూ లేకపోలేదు.
తాజాగా హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా లాంబోర్గిని ఉరుస్ అనే కారుని కొనుగోలు చేశారట. మామూలుగా ఎన్టీఆర్‌కి కార్లంటే చాలా ప్యాషన్. ఇప్పుడు ఎంతో ముచ్చటపడి ఈ ఇంపోర్టెడ్ కారుని కొనుగోలు చేశారట. ఇటలీ నుంచి ఈ కారును దిగుమతి చేయిస్తున్నారని సమాచారం. ఈ సూపర్ స్పోర్ట్స్ కారు ఖరీదు 5 కోట్ల వరకు ఉంటుందని టాక్.
లాంబోర్గిని ఉరుస్ మోడల్
Comments
Please login to add a commentAdd a comment