![Jr NTR Fans Help Poor People Occasion Of Birthday](/styles/webp/s3/article_images/2024/05/19/ntr_1_0.jpg.webp?itok=Pd6mV5wH)
మే 20 వచ్చిందంటే చాలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పండుగ. తారక్‌పై ఈగ కూడా వాలకుండా ఆయన చుట్టూ వైఫైలా అభిమానులు ఉంటారు. ఎన్టీఆర్‌ను ఎవరైనా కామెంట్ చేస్తే చాలు ఫ్యాన్స్ అంతా ఏకమై దండయాత్ర చేస్తారు. బాద్‌షాను టచ్ చేస్తే సౌండ్ సాలిడ్‌గా ఉంటుందనేలా వారందరూ తారక్‌పై ప్రేమను చూపుతారు.
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'రా ఎన్టీఆర్ 2.0' వ్యవస్థాపకులు రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ఆ టీమ్ సేవ చేస్తుంది. విద్యార్థుల కోసం పలు సేవా కార్యక్రమాలను చేసేందుకు వారు ఎప్పుడూ ముందుంటారు. ఇందుకోసం సోషల్ మీడియాలో వారు ఒక పేజీని క్రియేట్ చేసి సాయం అవసరం ఉన్నవారికి తమకు చేతనైనంత వరకు చేస్తున్నారు. మే 20న తారక్ పుట్టినరోజు కావడంతో రక్తదానం కార్యక్రమాన్ని చేపట్టి తమ అభిమానాన్ని ఇలా చూపించారు. దీంతో నెటిజన్ల నుంచి 'రా ఎన్టీఆర్ 2.0' వ్యవస్థాపకుల పట్ల ప్రశంసలు అందుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment