Jr NTR Corona Positive: నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు - Sakshi
Sakshi News home page

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు కరోనా

Published Mon, May 10 2021 3:22 PM | Last Updated on Wed, May 12 2021 2:26 PM

Jr NTR Tested Coronavirus Positive - Sakshi

కరోనా సినీ ప్రరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్‌ హీరోల నుంచి నటీనటులు, దర్శక-నిర్మాతల వరకు కోవిడ్‌ బారిన పడుతున్నారు. తాజాగా స్టార్‌ హీరో, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. 

సోమవారం ట్వీట్‌ చేసిన ఎన్టీఆర్‌.. ‘నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. నేను నా కుటుంబం ఐసోలేషన్‌లో ఉన్నాం. అన్ని కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాము. గత కొద్ది రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్నావారంతా కోవిడ్‌ పరీక్షలు చేసుకొవాల్సిందిగా అభ్యర్థిస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు. కాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఇటీవల మహ్మమ్మారి బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.  

చదవండి: 
కరోనా రక్కసికి బలైన టీఎన్‌ఆర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement