అజయ్ దేవగన్‌పై ఫిర్యాదు.. కోర్టుకెక్కిన కార్తీ 'ఖైదీ' నిర్మాతలు | Kaithi Movie Makers File A Case Against Ajay Devgn For Legal Dispute Over Remake Rights, More Details Inside | Sakshi
Sakshi News home page

అజయ్ దేవగన్‌పై ఫిర్యాదు.. కోర్టుకెక్కిన కార్తీ 'ఖైదీ' నిర్మాతలు

Mar 29 2026 8:28 AM | Updated on Mar 29 2026 11:07 AM

Kaithi Movie Makers file a case against Ajay Devgn

అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో, నటించి నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'భోలా' (2023).. తమిళ హిట్ చిత్రం 'ఖైదీ'కి రీమేక్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, భోలా చిత్ర నిర్మాతలు రీమేక్ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఒప్పందం ప్రకారం ఖైదీ సినిమా హక్కులకు సంబంధించిన పూర్తి డబ్బు చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొంది.

ఖైదీ సినిమా పూర్తి హక్కులు తమకే ఉన్నాయని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పేర్కొంది. హిందీ రీమేక్ కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఆ నిర్మాణ సంస్థ పేర్కొంది. అయితే, కొంత మొత్తంలో మాత్రమే డబ్బు చెల్లించారని తమకు ఇంకా రూ. 4కోట్లు బకాయి పడ్డారని భోలా చిత్ర నిర్మాతలపై ఆరోపణలు చేశారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం, కోర్టుకు అధికార పరిధి ఉందా లేదా అనే విషయంపై తీర్పును రిజర్వ్ చేసింది.

ఖైదీ సినిమా నచ్చడంతో హిందీలో భోలా పేరుతో రీమేక్‌ చేశారు. ఈ మూవీని  రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, అజయ్‌ దేవగన్‌ చిత్ర నిర్మాణ సంస్థ, టీ-సిరీస్‌ సంయుక్తంగా నిర్మించాయి. అయితే, ఖైదీ నిర్మాతలతో రీమేక్‌ హక్కులకు సంబంధించి కుదుర్చుకున్న ఢీల్‌ ప్రకారం పూర్తిగా డబ్బు చెల్లించలేదని తెలుస్తోంది. 2023లో విడుదలైన ఈ చిత్రం ఆశించినంత రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement