ఓటీటీలో భారతీయుడు.. అప్పటినుంచే స్ట్రీమింగ్‌.. | Kamal Haasan 1996 Indian Movie Releasing On This OTT Platform In July 2nd Week, Deets Inside | Sakshi
Sakshi News home page

Indian Movie: 28 ఏళ్ల తర్వాత ఓటీటీలో భారతీయుడు.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published Sat, Jul 13 2024 2:43 PM | Last Updated on Sat, Jul 13 2024 5:05 PM

Kamal Haasan Indian Movie Coming on This OTT Platform

కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంటాయి. అలాంటివాటిలో భారతీయులు మూవీ ముందు వరుసలో ఉంటుంది. కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 1996లో వచ్చింది. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో సెన్సేషన్‌ సృష్టించింది.

రెండున్నర దశాబ్దాల తర్వాత దీనికి సీక్వెల్‌ వచ్చింది. కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ తెలుగులో భారతీయుడు 2, తమిళంలో ఇండియన్‌ 2, హిందీలో హిందుస్థానీ 2 పేరుతో జూలై 12న విడుదలైంది. ఈ క్రమంలో ఇండియన్‌ సినిమా ఫస్ట్‌ పార్ట్‌ కోసం కొందరు ఓటీటీలో వెతికేస్తున్నారు.

అలాంటివారికోసం నెట్‌ఫ్లిక్స్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ సోమవారం (జూలై 15న) ఇండియన్‌ మొదటి భాగాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ సినిమాను మరోసారి చూసేందుకు ఫ్యాన్స్‌ రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే భారతీయుడు 2 చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వస్తోంది. ఫస్ట్‌ సినిమా ఓ రేంజ్‌లో ఉందని, కానీ రెండో భాగం దాని దరిదాపుల్లోకి కూడా రాలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

 

 

చదవండి: 15 ఏళ్లలోనే తొలిసారి.. అత్యంత దారుణమైన కలెక్షన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement