
దర్శకుడు వివేక్ అగ్రి హోత్రి ఇటీవల తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’కపై సినీ, రాజకీయ సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మార్చి 11న దేశవ్యాప్తంగా విడుదలైన ఈమూవీ భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు కలేక్షన్ల పరంగా కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సినిమా చూసి చిత్ర యూనిట్‌ని ప్రత్యేకంగా అభినందించారు. దీంతో ఈ మూవీ మరింత పాపులరిటీ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా చూసిన బాలీవుడ్ ఫ్రైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన రివ్యూ ఇచ్చింది. ఆమె హోస్ట్ వస్తున్న కాంట్రవర్సల్ రియాలిటీ షో లాక్‌అప్ నిన్నటి ఎపిసోడ్‌లో కంగనా ఈ మూవీ గురించి ప్రస్తావించింది.
చదవండి: యాంకర్ రష్మీపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు, ఆమె కాల్ రికార్డు ఇంకా ఉంది
ఈ మేరకు ఆమె ‘‘ఈ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రితో పాటు నిర్మాతలకు, మూవీ టీంకు అభినందనలు. సినిమా పరిశ్రమ పాపాలను వారు కడిగేశారు. బాలీవుడ్ చేసిన పాపాలను కూడా ప్రక్షాళన చేశారు. కశ్మీర్ ఫైల్స్‌ను గొప్పగా చూపించారు. పరిశ్రమలో ఎలుకల్లా దాగిన వారు బయటకు వచ్చి ఈ సినిమాను ప్రోత్సహించాలి. పనికిరాని సినిమాలను ప్రోత్సహించే వారందరూ సినిమాకు మద్దతుగా నిలవాలి’’ అని కంగనా పిలుపునిచ్చింది. కాగా గతవారం కూడా కంగనా ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ ఏడాది వచ్చిన వాటిల్లో ఎంతో విజయవంతమైన, లాభదాయకమైన చిత్రంగా ఆమె దీన్ని పేర్కొంటూ, కేస్ స్టడీగా తీసుకోవాలని పేర్కొన్న సంగతి తెలిసిందే.
చదవండి: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీపై ఆర్జీవీ రివ్యూ, ఏమన్నాడంటే..
Comments
Please login to add a commentAdd a comment