
కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వ్యవహారంపై బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ వివాదానికి దారి తీసే వ్యాఖ్యలు చేశారు. 'మీకంత దమ్ము, ధైర్యం ఉంటే ఆప్ఘనిస్తాన్‌లో బురఖా ధరించకుండా చూపించండి 'అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా ఆనంద్ రంగనాథన్ షేర్ చేసిన పోస్ట్‌ను సైతం పంచుకుంది.
కాగా ఇటీవల హేమమాలిని సైతం ఈ వివాదంపై స్పందిస్తూ.. స్కూల్స్ అనేవి విద్యాబోధనకే తప్ప వర్గపాఠాలు నేర్పడానికి కాదని గట్టిగానే బదులిచ్చింది. స్కూల్‌లో అందరూ యూనిఫామ్స్ మాత్రమే ధరించాలని పేర్కొంది. కావాలనుకుంటే విద్యాలయాలు మినహా మిగతా ఎక్కడైనా మీకు నచ్చిన దుస్తులు ధరించవచ్చని సూచించింది. కాగా కర్ణాటక ప్రభుత్వం విద్యార్థినులను హిజాబ్‌తో ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించకపోవడం తెలిసిందే. దీనిపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా హిజాబ్ వివాదాన్ని పెద్దది చేయకండని అత్యున్నత న్యాయస్థానం మండిపడింది.
Comments
Please login to add a commentAdd a comment