
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ , రిషబ్ శెట్టి కాంబినేషన్‌లో వచ్చిన కన్నడ చిత్రం ‘కాంతారా’. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రానికి అక్కడ భారీ విజయం సాధించింది.. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు మేకర్స్. తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ‘కాంతారా’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
(చదవండి: ఆదిపురుష్ టీజర్‌పై తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు)
కాంతారా అనేది సంస్కృత పదం. తెలుగులో దీనికి అడవి అని అర్థం వస్తుంది. ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావారాన్ని ఆహ్లదకరంగా చూపించిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు . అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రిషబ్ శెట్టి ఈ చిత్రానికి నటనే కాకుండా స్వయంగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించారు.హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment