దేవరతో పోటీ.. బరిలోకి దిగుతున్న హిట్‌ కాంబినేషన్‌ సినిమా | Karthi Meiyazhagan Movie Clash With Jr NTR Devara In Box Office Collections, Deets Inside | Sakshi
Sakshi News home page

దేవరతో పోటీ.. బరిలోకి దిగుతున్న హిట్‌ కాంబినేషన్‌ సినిమా

Published Fri, Jul 19 2024 1:02 PM | Last Updated on Fri, Jul 19 2024 2:45 PM

Karthi Movie Clash With Devara

కోలీవుడ్‌ హీరో కార్తీ  నటిస్తున్న తాజా చిత్రాల్లో మెయళగన్‌ ఒకటి. 96 చిత్రం ఫేమ్‌ ప్రేమ్‌కుమార్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జ్యోతిక, సూర్య నిర్మిస్తున్నారు. నటుడు అరవింద్‌సామి ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నటి శ్రీదివ్య, స్వాతి కొండే, రాజ్‌కిరణ్, దేవదర్శిని, జయప్రకాశ్, శ్రీరంజనీ, ఇళవరసు, కరుణాకరన్, రైచల్‌ రిబాకా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 

గోవింద్‌ వసంత సంగీతాన్ని, మహేంద్రన్‌ జయరాజు ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని యూనిట్‌ వర్గాలు ఇప్పటికే తెలిపారు. అయితే చిత్రంలో జల్లికట్టు సన్నివేశాలు వంటి పలు యాక్షన్‌ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. కాగా షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న మెయళగన్‌ చిత్రాన్ని సెప్టెంబర్‌ 27వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. 

దీనికి సంబంధించి నటుడు కార్తీ జల్లికట్టు ఎద్దుగా సవారీ చేస్తున్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇకపోతే ఇదే తేదీన జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న దేవర చిత్రం తెరపైకి రానుంది. ఈ రెండు చిత్రాలు తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానున్నాయి. దీంతో వీటి మధ్య పోటీ నెలకొంటుందన్న టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement