‘ది కశ్మీర్ ఫైల్స్’.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ.. పెను సంచలనంగా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌తో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు అడగకుండానే వినోదపు పన్నును మినహాయించాయి. అస్సాం ప్రభుత్వం అయితే ఈ సినిమా కోసం ఏకంగా తమ ఉద్యోగులకు హాప్‌డే సెలవునే ప్రకటించింది.
ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దూసుకెళ్తోంది. రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 50 కోట్లను కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. ఈ వారాంతంలో ఈ మూవీ కచ్చితంగా రూ.100 కోట్లు వసూళ్లను రాబడుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీల విడుదలవుతుందా అని సీనీ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. వాస్తవానికి ఈ మూవీ విడుదలైన (మార్చి 11) నాలుగు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారు. ఈ మేరకు ఒప్పద్దం కూడా కుదుర్చుకున్నారు అయితే ఇప్పుడు ఈ చిత్రానికి వచ్చి క్రేజ్ దృష్ట్యా ఓటీటీ విడుదల తేదిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారంలో కాకుండా.. మేలో ఈ చిత్రాన్ని ఓటీటీ విడుదల చేయాలని భావిస్తున్నారట.
తాజా సమాచారం ప్రకారం మే 6 నుంచి జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం విషయానికొస్తే.. 1980-90లలో కశ్మీర్‌లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment