The Kashmir Files In OTT Streaming In ZEE5: Release In Hindi And South Languages, Details Inside - Sakshi
Sakshi News home page

The Kashmir Files OTT: దక్షిణాది భాషల్లో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ ఓటీటీ స్ట్రీమింగ్‌, ఎక్కడంటే

Published Tue, Apr 19 2022 8:33 PM | Last Updated on Wed, Apr 20 2022 10:44 AM

The Kashmir Files OTT Streaming In ZEE5 In Hindi And South Languages - Sakshi

The Kashmir Files OTT Streaming In South Languages: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’.. ఈ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం 10 కోట్ల బడ్జెట్‌తో ఎలాంటి స్టార్‌ కాస్ట్‌ లేకుండా వచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలను తలికిందులు చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ రూ. 250 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టింది.  చెప్పాలంటే పాన్‌ ఇండియా వంటి సినిమాలకు ఈ మూవీ పోటీ ఇచ్చింది. 1990లో కశ్మీర్‌ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి ఈ మూవీని తెరకెక్కించారు.

చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌!

ఇందులో ప్రముఖ బాలీవుడ్‌ నటులు అనుపమ్‌ ఖేర్‌, మిథున్ చక్రవర్తి, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. మార్చి 11న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ప్రధానీ మోదీ సైతం ప్రశంసించిన ఈ సినిమాను చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ది కశ్మీర్‌ ఫైల్స్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకుంటే థియేటర్లో కేవలం హిందీలో విడుదలైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం అన్ని భాషల్లో స్ట్రీమింగ్‌ కానుందట. ఇప్పటికే ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ జీ5 సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: భారీ ఆఫర్‌ను తిరస్కరించిన అల్లు అర్జున్‌!, ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్‌

త్వరలోనే ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. త్వరలోనే ‘ది కశ్మీర్ ఫైల్స్‌’ స్ట్రీమింగ్‌ డేట్‌పై జీ5 అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుంది. ఈ విషయాన్ని స్వయంగా జీ5 చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మనీశ్‌ కల్రా ఇటీవల ఓ ఇంటర్య్వూలో వెల్లడించినట్లు ఓ నేషనల్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. దీని ప్రకారం ఈ మూవీ అతికొద్ది రోజుల్లోనే అంటే మే మొదటి వారంలో జీ5లో విడుదల కానుందని సదరు మీడియాతో మనీశ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌కు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు నుంచి భారీ రెస్పాన్స్‌ వస్తోంది. అందుకే జీ5లో కశ్మీర్‌ ఫైల్స్‌ను ఎక్స్‌క్లూసివ్‌గా స్ట్రీమింగ్‌ చేయబోతున్నాం’ స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement