‘ఈగల్‌’లో రొమాన్స్‌ డిఫరెంట్‌గా కొత్తగా ఉంటుంది: కావ్య థాపర్‌ | Kavya Thapar Talks About Eagle Movie | Sakshi
Sakshi News home page

‘ఈగల్‌’లో రొమాన్స్‌ డిఫరెంట్‌గా కొత్తగా ఉంటుంది: కావ్య థాపర్‌

Published Tue, Feb 6 2024 5:13 PM | Last Updated on Tue, Feb 6 2024 5:21 PM

Kavya Thapar Talks About Eagle Movie - Sakshi

‘ఈగల్ లో యాక్షన్ రోమాన్స్ చాలా యూనిక్ గా ఉంటాయి. రోమాన్స్ అయితే చాలా డిఫరెంట్ గా, కొత్తగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు’అన్నారు యంగ్‌ హీరోయిన్‌ కావ్య థాపర్‌.మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫిబ్రవరి 9న ఈగల్‌ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్‌ కావ్య థాపర్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం ముంబైలో వున్న సమయంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని  ఈగల్ కథ చెప్పారు. చాలా కొత్తగా, అద్భుతంగా అనిపించింది. తప్పకుండ సినిమా చేయాలని అనుకున్నాను. అన్నిటికంటే రవితేజ గారి సినిమాలో చేయడం గొప్ప అవకాశం. లుక్ టెస్ట్  చేసిన తర్వాత ఎంపిక చేశారు.

ఇందులో నా పాత్ర పేరు రచన. జీవితంలో చాలా యునిక్ గోల్స్ వున్న అమ్మాయిగా కనిపిస్తాను. ఇందులో చాలా అద్భుతమైన ప్రేమకథ ఉంది.  దాని గురించి అప్పుడే ఎక్కువ రివిల్ చేయకూడదు(నవ్వుతూ). రవితేజ గ, నా పాత్రల మధ్య కెమిస్ట్రీ చాలా యూనిక్ గా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈగల్ పై రవితేజ , డైరెక్టర్ కార్తిక్, మా టీం అంతా చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్ గా వున్నాం. ఈగల్ తప్పకుండా ప్రేక్షకులని చాలా గొప్పగా అలరిస్తుంది.  

రవితేజ గారితో సినిమా చేయడం నా అదృష్టం. రవితేజ గారి వ్యక్తిత్వానికి నేను పెద్ద అభిమానిని. ఆయన చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. సెట్స్ లో చాలా సరదాగా, సపోర్టివ్ గా ఉంటారు. ఆయనతో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభూతి. పోలాండ్, లండన్ ఇలా అద్భుతమైన ఫారిన్ లోకేషన్స్ లో ఇంటర్ నేషనల్ లెవల్ లో షూట్ చేశారు. నిజంగా ఒక వెకేషన్ లానే అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను.

భవిష్యత్తులో ఫుల్ మాస్ యాక్షన్ సినిమా చేయాలని ఉంది(నవ్వుతూ). అలాగే సూపర్ నేచురల్ సినిమాలు చేయాలని ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement