
పూ రాము
తాతా–మనవడి అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘కీడా’. పూ రాము, కాళీ వెంకట్ ముఖ్య తారలుగా దీపన్, పాండియమ్మ, విజయ, కమలి కీలక పాత్రల్లో నటించారు. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ తమిళ చిత్రం తెలుగులో ‘దీపావళి’గా రిలీజ్ కానుంది. పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో నవంబరు 11న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రామ్ షేర్ చేశారు.
దీపావళి పండక్కి మనవడికి కొత్త డ్రెస్ కొనాలని ఓ మేకను అమ్మకానికి పెడతాడు తాత. కానీ అది మొక్కుబడి మేక కావడంతో ఊర్లో ఎవరూ కొనరు. చివరికి మటన్‌షాప్ పెట్టుకోవాలనుకునే వీరబాబు కొంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రం ప్రధానాంశం. మేక పాత్ర అబ్బులుకు నటుడు సప్తగిరి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘‘ఈ చిత్రంలో తాత– మనవడు–మేక మధ్య అనుబంధం, వారి భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment