సినిమా షూటింగ్‌లకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రీకరణ బుధవారం తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్ ప్రారంభమైన తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఇందులో ప్రకాశ్ రాజ్ సూటు వేసుకుని కనిపించడంతో పాటు అక్కడ ఉన్న సెట్టింగ్‌ను చూసి ఆయన పాత్ర ఏంటో అందరూ ఓ అంచనాకు వచ్చేశారు. కేజీఎఫ్ చాప్టర్ 1లో జర్నలిస్ట్ అనంత్ నాగ్ పాత్రను ఈసారి ప్రకాశ్ రాజ్ చేస్తున్నాడనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అసలు జర్నలిస్ట్ పాత్రతో ప్రకాశ్ రాజ్‌కు ఎలాంటి సబంధమూ లేదని దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు. (చదవండి: నటితో అసభ్య ప్రవర్తన: ఇద్దరు అరెస్ట్)
"మొదటి భాగంలో సీనియర్ జర్నలిస్టుగా కనిపించిన అనంత్ నాగ్ పాత్రను ప్రకాశ్ రాజ్ చేయడం లేదు. ఆయనది న్యూ ఎంట్రీ, సినిమాలో కొత్త పాత్ర" అని చెప్పుకొచ్చారు. ఆయన ఇచ్చిన క్లారిటీ అభిమానులను మరింత సర్‌ప్రైజ్ చేస్తోంది. కేజీఎఫ్ 2లో కొత్త పాత్రలను చేర్చి సినిమా స్థాయిని మరింత పెంచుతున్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. తొలుత పది రోజుల పాటు ప్రకాశ్ రాజ్, మాళవిక అవినాష్, నాగభరణ్ తదిదరులపై షూట్ చేయనున్నారు. ఆ తర్వాత రాఖీభాయ్ యశ్‌పై సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ సినిమాను థియేటర్లలో దసరా కానుకగా అక్టోబర్ 23న విడుదల చేయనున్నారు. (చదవండి: నాన్న చంపాలని చూస్తున్నారు : నటి వైరల్ వీడియో)
Comments
Please login to add a commentAdd a comment