కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టీజర్.. సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్! | Kiran Abbavaram's KA Movie Telugu Teaser | Sakshi
Sakshi News home page

KA Movie Teaser: 'క' టీజర్.. అలాంటి స్టోరీతో సినిమా?

Published Mon, Jul 15 2024 11:27 AM | Last Updated on Mon, Jul 15 2024 11:38 AM

Kiran Abbavaram's KA Movie Telugu Teaser

కిరణ్ అబ్బవరం.. టాలీవుడ్ యంగ్ హీరోల్లో కాస్త మెరిట్ ఉన్న నటుడు. కాకపోతే దగ్గరకొచ్చిన సినిమాలన్నీ చేసేసి వరస ఫ్లాఫులు ఎదుర్కొన్నాడు. లెక్కకు మించిన విమర్శలు వచ్చేసరికి ఆలోచనలో పడిపోయాడు. ఏడాదికి మూడు సినిమాలు చేసే ఇతడు.. చాలా నెలల తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. దీని టీజరే ఇప్పుడు కిరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్)

'రాజావారు రాణిగారు' మూవీతో హీరోగా పరిచయమైన కిరణ్.. ఆ తర్వాత వరస సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ చూడలేకపోయాడు. దీంతో కాస్త టైమ్ తీసుకుని చేసిన పీరియాడికల్ మూవీ 'క'. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ బట్టి చూస్తుంటే.. ఇదేదో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌లా అనిపిస్తోంది. పక్కనోళ్ల ఉత్తరాలు చదివే ఓ పోస్ట్ మాస్టర్.. ఊరిలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ అని తెలుస్తోంది.

'నాకు తెలిసిన నేను మంచి.. నాకు తెలియని నేను..' అనే డైలాగ్‌తోపాటు విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా అన్నీ కూడా కిరణ్ అబ్బవరం గత చిత్రాలతో పోలిస్తే కాస్త డిఫరెంట్‌గా ఉన్నాయి. టీజర్ కాబట్టి కంటెంట్ పెద్దగా రివీల్ చేయలేదు. కానీ ప్రామిసింగ్‌గా ఉంది. మీరు ఓ లుక్కేసేయండి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement