ka
-
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టీజర్.. సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్!
కిరణ్ అబ్బవరం.. టాలీవుడ్ యంగ్ హీరోల్లో కాస్త మెరిట్ ఉన్న నటుడు. కాకపోతే దగ్గరకొచ్చిన సినిమాలన్నీ చేసేసి వరస ఫ్లాఫులు ఎదుర్కొన్నాడు. లెక్కకు మించిన విమర్శలు వచ్చేసరికి ఆలోచనలో పడిపోయాడు. ఏడాదికి మూడు సినిమాలు చేసే ఇతడు.. చాలా నెలల తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. దీని టీజరే ఇప్పుడు కిరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్)'రాజావారు రాణిగారు' మూవీతో హీరోగా పరిచయమైన కిరణ్.. ఆ తర్వాత వరస సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ చూడలేకపోయాడు. దీంతో కాస్త టైమ్ తీసుకుని చేసిన పీరియాడికల్ మూవీ 'క'. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ బట్టి చూస్తుంటే.. ఇదేదో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌లా అనిపిస్తోంది. పక్కనోళ్ల ఉత్తరాలు చదివే ఓ పోస్ట్ మాస్టర్.. ఊరిలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ అని తెలుస్తోంది.'నాకు తెలిసిన నేను మంచి.. నాకు తెలియని నేను..' అనే డైలాగ్‌తోపాటు విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా అన్నీ కూడా కిరణ్ అబ్బవరం గత చిత్రాలతో పోలిస్తే కాస్త డిఫరెంట్‌గా ఉన్నాయి. టీజర్ కాబట్టి కంటెంట్ పెద్దగా రివీల్ చేయలేదు. కానీ ప్రామిసింగ్‌గా ఉంది. మీరు ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
మామ చేతిలో అల్లుడి హతం
మామ,చేతిలో,అల్లుడి,హతం,murder,ka,mallavaram కేఏ మల్లవరం (కోటనందూరు) : మామ చేతిలో అల్లుడు హత్యకు గురైన సంఘటన కేఏ మల్లవరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సింగంపల్లి బుల్లెబ్బాయి, అడిగర్ల సత్యనారాయణలు వరుసకు మామా అల్లుడు. అల్లుడు సత్యనారాయణ (45) తాగుబోతు. రోజూ తాగి ఇంటికి వచ్చి భార్య, అత్తమామలను వేధిస్తూ ఉండేవాడు. శుక్రవారం ఉదయం భార్య, అత్త పొలం పనులకు బయటకు వెళ్లిన సమయంలో సత్యనారాయణ తాగి వచ్చి ఇంట్లో అన్నం తింటున్న మామను కాలుతో తన్ని దుర్భాషలాడాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. దీంతో సింగంపల్లి బుల్లబ్బాయి ఇంటి నుంచి బయటకు వెళ్లి పోయాడు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి తిరిగి ఇంటికి వచ్చే సరికి మద్యం మత్తులో నిద్రిస్తున్న అల్లుడు సత్యనారాయణను మెడ, ముఖం, చేతులపై కత్తితో విచక్షణ రహితంగా నరికి చంపేశాడు. గ్రామ నౌకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటనందూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తుని రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు, ఎస్సై బి.శంకర్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.