మామ చేతిలో అల్లుడి హతం | murder at ka mallavaram | Sakshi
Sakshi News home page

మామ చేతిలో అల్లుడి హతం

Published Fri, Aug 4 2017 11:08 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

మామ చేతిలో అల్లుడి హతం - Sakshi

మామ చేతిలో అల్లుడి హతం

మామ,చేతిలో,అల్లుడి,హతం,murder,ka,mallavaram
కేఏ మల్లవరం (కోటనందూరు) : మామ చేతిలో అల్లుడు హత్యకు గురైన సంఘటన కేఏ మల్లవరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సింగంపల్లి బుల్లెబ్బాయి, అడిగర్ల సత్యనారాయణలు వరుసకు మామా అల్లుడు. అల్లుడు సత్యనారాయణ (45) తాగుబోతు. రోజూ తాగి ఇంటికి వచ్చి భార్య, అత్తమామలను వేధిస్తూ ఉండేవాడు. శుక్రవారం ఉదయం భార్య, అత్త పొలం పనులకు బయటకు వెళ్లిన సమయంలో సత్యనారాయణ తాగి వచ్చి ఇంట్లో అన్నం తింటున్న మామను కాలుతో తన్ని దుర్భాషలాడాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. దీంతో సింగంపల్లి బుల్లబ్బాయి ఇంటి నుంచి బయటకు వెళ్లి పోయాడు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి తిరిగి ఇంటికి వచ్చే సరికి మద్యం మత్తులో నిద్రిస్తున్న అల్లుడు సత్యనారాయణను మెడ, ముఖం, చేతులపై కత్తితో విచక్షణ రహితంగా నరికి చంపేశాడు. గ్రామ నౌకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటనందూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తుని రూరల్‌ సీఐ జి.చెన్నకేశవరావు, ఎస్సై బి.శంకర్‌ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement