Kodi Divya Deepthi Talk About Nenu Meeku Baga Kavalsina Vaadini Movie | Kiran Abbavaram - Sakshi
Sakshi News home page

Nenu Meeku Baga Kavalsina Vaadini Movie: ప్రతిరోజూ ఓ చాలెంజ్‌ : కోడి దివ్య

Published Wed, Sep 14 2022 9:43 AM | Last Updated on Wed, Sep 14 2022 11:24 AM

Kodi Divya Deepthi Talk About Nenu Meeku Baga Kavalsina Vaadini Movie - Sakshi

‘‘సినిమా నిర్మాణం అనేది ప్రతి రోజూ ఓ చాలెంజ్‌లా అనిపించింది. కానీ కష్టంగా భావించకుండా ఓ లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌లా అనుకుని చేశాను. ఇప్పుడున్నంత టెక్నాలజీ ఒకప్పుడు లేదు కానీ అప్పుడు వర్క్‌ చాలా స్పీడ్‌గా జరిగేది. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా కొన్ని అంశాల్లో వర్క్‌ అనుకున్న విధంగా సాగడం లేదు. ఎందుకు అలా జరుగుతుందనే విషయంపై నేను మరింత ఫోకస్‌ పెట్టాలని అనుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత కోడి దివ్యదీప్తి. కిరణ్‌ అబ్బవరం, సంజనా ఆనంద్‌ జంటగా శ్రీధర్‌ గాదె దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’.

దివంగత ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ నెల 16న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా కోడి దివ్య మాట్లాడుతూ– ‘‘సినిమా బాగా వచ్చింది. హిట్‌ సాధిస్తుందనే నమ్మకంతోనే ఉన్నాం. కిరణ్‌ అబ్బవరం బాగా నటించారు. ఈ సినిమాకు ఆయన కొన్ని డైలాగ్స్‌ కూడా ఇచ్చారు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను జోడిస్తూ ఓ మంచి పాయింట్‌ను ఈ సినిమాలో టచ్‌ చేశాం. ఫాదర్‌ అండ్‌ డాటర్‌ ఎమోషన్స్‌ ఉన్నాయి. ప్రతి ఫ్యామిలీ ఆడియన్, ప్రతి అమ్మాయి ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతారు. కిరణ్‌ అబ్బవరం, బాబా భాస్కర్‌ ట్రాక్‌ కూడా బాగా వర్కౌట్‌ అవుతుంది. 
మణిశర్మగారు ఇచ్చిన ఆరు పాటలు, ఆర్‌ఆర్‌ సినిమాకు మరో హైలైట్‌. ఓవర్‌సీస్‌లో కాకుండా ఈ సినిమాను దాదాపు 550 థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నాం. భవిష్యత్‌లో తప్పకుండా దర్శకత్వం వహిస్తాను’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement