Kodi Divya Deepthi
-
నిర్మాణ రంగంలో రాణిస్తున్న లేడీ ప్రొడ్యూసర్స్, ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చింది వీరే
అమ్మాయిలంటే సిల్వర్ స్క్రీన్‌పై మెరవడానికే.. స్క్రీన్ వెనక టెక్నీషియన్స్గానో, సినిమాలకు పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్‌గా సూట్ అవ్వరనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. అందుకే ఈ రెండు విభాగాల్లో తక్కువమంది ఉంటారు. అయితే రోజులు మారుతున్నాయి. మహిళా సాంకేతిక నిపుణులు పెరుగుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది నిర్మాణ రంగంలో లేడీ ప్రొడ్యూసర్ల సంఖ్య పెరిగింది. అరడజను మందికి పైగా ఈ ఏడాది నిర్మాతలుగా పరిచయం కావడం ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పువచ్చు. ఇక ఈ ఏడాది ఫిలిం మేకింగ్ (నిర్మాణం)లోకి వచ్చిన మేడమ్స్ గురించి తెలుసుకుందాం. దివంగత ప్రముఖ నటులు, నిర్మాత కృష్ణంరాజు పెద్ద కుమార్తె సాయి ప్రసీద ‘రాధేశ్యామ్’ సినిమాతో ఈ ఏడాది నిర్మాతగా పరిచయం అయ్యారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. వంశీ, ప్రమోద్ (యూవీ క్రియేషన్స్)లతో కలిసి ప్రసీద (గోపీకృష్ణా మూవీస్) ఈ సినిమా నిర్మించారు. నిర్మాణరంగంలోకి అడుగు పెట్టక ముందు విదేశాల్లో ప్రసీద ప్రొడక్షన్ కోర్స్‌లో చేశారు. మరోవైపు దివంగత ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దివ్య దీప్తి నిర్మించిన తొలి చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, సంజన జంటగా నటించారు. తండ్రి దర్శకత్వం వహించిన చిత్రాల షూటింగ్‌లకు దివ్య వెళ్లేవారు. అలా ఫిలిం మేకింగ్‌పై అవగాహన పెంచుకున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా మారారు. సమంత టైటిల్ రోల్ చేసిన ‘శాకుంతలం’ సినిమాకు నీలిమ ఓ నిర్మాత. ఈ ఏడాది నవంబరులో విడుదల కావాల్సిన ఈ పీరియాడికల్ ఫిల్మ్ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇక నిర్మాణరంగంలో ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌ది ప్రత్యేక స్థానం. ఈ నిర్మాణ సంస్థలో వచ్చిన చిత్రాలకు (సిరి సిరి మువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం..) పదికిపైగా జాతీయ అవార్డులు వచ్చాయి. ఏడిద నాగేశ్వరరావు వారసురాలిగా ఆయన మనవరాలు ఏడిద శ్రీజ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చిత్రం ద్వారా నిర్మాతగా తొలి అడుగు వేశారు. శ్రీజ ఎంటర్టైన్మెంట్స్పై రూపొందిన ఈ చిత్రంలో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు జంటగా నటించారు. కాగా ప్రస్తుతం తెలుగులో ఉన్న అగ్ర నిర్మాతల్లో ‘దిల్’ రాజు ఒకరు. ఆయన కుమార్తె హన్షిత రెడ్డి నిర్మాణరంగంపై దృష్టి సారిస్తున్నారు. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో ‘దిల్’ రాజు డిజిటల్ కంటెంట్‌ను నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్లో ‘ఏటీఎమ్’ అనే వెబ్ సిరీస్ కూడా ఆరంభమైంది. ఈ సిరీస్‌కు దర్శకుడు హరీష్ శంకర్ కథ ఇచ్చారు. బిగ్‌బాస్ ఫేమ్ వీజే సన్నీ, సుబ్బరాజు ప్రధాన పాత్రధారులుగా రూపుదిద్దుకుంటున్న ఈ సిరీస్‌కి హన్షిత రెడ్డి ఓ నిర్మాతగా ఉన్నారు. యాక్షన్ టు ప్రొడక్షన్ హీరోయిన్లు కూడా నిర్మాతలుగా మారు తుంటారు. హీరోయిన్ మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ నిర్మాతగా మారారు. రాహుల్ విజయ్, మేఘా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మాటే మంత్రము’ చిత్రానికి బిందు ఆకాష్ ఓ నిర్మాతగా ఉన్నారు. పేరు తల్లిది అయినప్పటికీ కూతురు మేఘా ఆకాష్ సపోర్ట్‌తోనే బిందు నిర్మాత అయ్యుంటారని ఊహించవచ్చు. ఇక మలయాళ బ్యూటీ ఐశ్వర్యా లక్ష్మి ‘గార్గి’ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం అయ్యారు. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే టాప్ హీరోయిన్ కీర్తీ సురేష్ త్వరలో ఓ ప్రొడక్షన్ హౌస్ ఆరంభించనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హిందీలోనూ.. బాలీవుడ్‌లోనూ ఈ ఏడాది లేడీ నిర్మాతల జాబితాలో కొందరు హీరోయిన్ల పేర్లు చేరాయి. హన్సల్ మెహతా తెరకెక్కించనున్న ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్‌లో నటించి, నిర్మించనున్నారు కరీనా కపూర్. ఏక్తా కపూర్‌తో కలిసి ఆమె ఈ సినిమా నిర్మించనున్నారు. ఇక షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఆలియా భట్ ‘డార్లింగ్స్’ అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో ఆలియా నటించారు కూడా. హీరోయిన్ కృతీ కుల్హారి కూడా ‘నాయిక’ అనే సినిమాలో నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇలా నిర్మాణ రంగంలోనూ స్త్రీ శక్తి ప్రవేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. -
‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ మూవీ రివ్యూ
టైటిల్: నేను మీకు బాగా కావాల్సిన వాడిని నటీనటులు: కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సోనూ ఠాకూర్, సిధ్ధార్ద్ మీనన్, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్కర్, సమీర్ తదితరులు నిర్మాణ సంస్థ: కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: కోడి దివ్య దీప్తి దర్శకత్వం : శ్రీధర్ గాదె మాటలు, స్క్రీన్‌ప్లే: కిరణ్ అబ్బవరం సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫి: రాజ్ నల్లి విడుదల తేది: సెప్టెంబర్ 16, 2022 రాజావారు రాణిగారు, ఎస్ఆర్ కల్యాణమండపం లాంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్యే సమ్మతమే అంటూ ప్రేక్షకులన పలకరించిన కిరణ్.. తాజాగా ‘మీకు బాగా కావాల్సిన వాడిని’అంటూ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన లభించింది. తాజానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ని కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచాల మధ్య ఈ శుక్రవారం (సెప్టెంబర్16) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. వివేక్(కిరణ్ అబ్బవరం) ఓ క్యాబ్ డ్రైవర్.అతనికి ఓ సాఫ్ట్వేర్ అమ్మాయి తేజు(సంజనా ఆనంద్) పరిచయం అవుతుంది. ఆమె ప్రతి రోజు రాత్రి మద్యం సేవించి.. వివేక్ క్యాబ్‌ని బుక్ చేసుకొని ఇంటికి వెళ్తుంది. అయితే ఓ రోజు రాత్రి మద్యం మత్తులో ఉన్న తేజూను ఓ రౌడీ ముఠా ఎత్తుకెళ్తే.. వారి నుంచి ఆమెను రక్షిస్తాడు. ఆ తర్వాత ఆమె ఎందుకిలా రోజూ అతిగా మద్యం సేవిస్తుందో అడిగి తెలుసుకుంటాడు. తనను సిద్దు(సిధ్ధార్ద్ మీనన్) ప్రేమించి మోసం చేశాడని, తన అక్క చేసిన తప్పుకు తనకు శిక్ష పడిందని బాధ పడుతుంది. వివేక్ తన మాటలతో సంజుని ప్రోత్సహించి ఇంటికి పంపిస్తాడు. ఏడాది తర్వాత ఇంటికి వచ్చిన తేజుని కుటుంబ సభ్యులు ఒక్క మాట అనకుండా ఇంట్లోకి ఆహ్వానిస్తారు. తానను ఫ్యామిలికి దగ్గరకు చేసిన వివేక్‌పై ఇష్టం పెంచుకుంటుంది తేజు. ఓ రోజు తన ప్రేమ విషయాన్ని అతనితో చెప్పాలనుకుంటుంది. అయితే అదే సమయంలో తేజుకు షాకిస్తాడు వివేక్. తన పేరు వివేక్ కాదని పవన్ అని చెబుతాడు. మలేషియాలో ఉండే పవన్ క్యాబ్ డ్రైవర్ వివేక్‌గా ఎందుకు మారాడు? తేజును ప్రేమించి మోసం చేసిందెవరు? ఆమె అక్క చేసిన తప్పేంటి? చివరకు తేజు, వివేక్‌లు ఎలా ఒక్కటయ్యారనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ కథ కొత్తదేమి కాదు. పాత కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. అందులో కొంతవరకు మాత్రమే దర్శకుడు సఫలం అయ్యాడు. ట్విస్టులు బాగున్నప్పటికీ.. కథనం మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. కుటుంబానికి దూరమైన బాధలో మద్యానికి అలవాటైన హీరోయిన్ని హీరో తన మాటలతో మార్చి, ఆమెను కుటంబానికి దగ్గరయ్యేలా చేయడమే ఈ సినిమా కథ. అయితే ఇందులో వచ్చే ట్విస్టుల మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. ఫస్టాఫ్ అంతా కిరణ్ అబ్బవరం గెస్ట్ రోల్‌గానే కనిపిస్తాడు. ఫ్యామిలీతో తేజుకు ఉన్న అనుబంధం, ఆమె లవ్‌స్టోరి, అందులో వచ్చే ట్విస్ట్‌లతో ఫస్టాప్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో లాయర్ పాపతో వివేక్ లవ్‌స్టోరీ ఫన్నీగా సాగుతుంది. చివరకు ఆమె ఇచ్చిన ట్విస్ట్ నవ్వులు పూయిస్తుంది. అయితే కొన్ని డైలాగ్స్ మాత్రం సహజంగా కాకుండా తెచ్చిపెట్టినట్లుగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది. లాజిక్కులు వెతక్కుండా చూస్తే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాస్త అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. క్యాబ్ డ్రైవర్ వివేక్ పాత్రకి కిరణ్ అబ్బవరం న్యాయం చేశాడు. గత చిత్రాలలో పోలిస్తే నటన పరంగా ఓ మెట్టు ఎక్కాడనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంజనా ఆనంద్ పాత్ర చాలా కీలకం. తేజుగా ఆమె తనదైన నటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. లాయర్ దుర్గగా సోనూ ఠాకూర్ మెప్పించింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. తెరపై అందంగా కనిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంది. సంజు తండ్రిగా నటించిన ఎస్వీ కృష్ణారెడ్డి తన పాత్రకు న్యాయం చేశాడు. సెకండాఫ్‌లో బాబా భాస్కర్ తనదైన కామెడీతో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. మణిశర్మ సంగీతం బాగుంది. పాటలు ఈ సినిమాకు చాలా ప్లస్. నేపథ్య సంగీతం పర్వాలేదు. రాజ్ నల్లి సినిమాటోగ్రఫి బాగుంది. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
ప్రతిరోజూ ఓ చాలెంజ్ : కోడి దివ్య
‘‘సినిమా నిర్మాణం అనేది ప్రతి రోజూ ఓ చాలెంజ్లా అనిపించింది. కానీ కష్టంగా భావించకుండా ఓ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌లా అనుకుని చేశాను. ఇప్పుడున్నంత టెక్నాలజీ ఒకప్పుడు లేదు కానీ అప్పుడు వర్క్ చాలా స్పీడ్‌గా జరిగేది. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా కొన్ని అంశాల్లో వర్క్ అనుకున్న విధంగా సాగడం లేదు. ఎందుకు అలా జరుగుతుందనే విషయంపై నేను మరింత ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత కోడి దివ్యదీప్తి. కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్ జంటగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. దివంగత ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ నెల 16న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా కోడి దివ్య మాట్లాడుతూ– ‘‘సినిమా బాగా వచ్చింది. హిట్ సాధిస్తుందనే నమ్మకంతోనే ఉన్నాం. కిరణ్ అబ్బవరం బాగా నటించారు. ఈ సినిమాకు ఆయన కొన్ని డైలాగ్స్ కూడా ఇచ్చారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడిస్తూ ఓ మంచి పాయింట్‌ను ఈ సినిమాలో టచ్ చేశాం. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ ఉన్నాయి. ప్రతి ఫ్యామిలీ ఆడియన్, ప్రతి అమ్మాయి ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. కిరణ్ అబ్బవరం, బాబా భాస్కర్ ట్రాక్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. మణిశర్మగారు ఇచ్చిన ఆరు పాటలు, ఆర్ఆర్ సినిమాకు మరో హైలైట్. ఓవర్సీస్లో కాకుండా ఈ సినిమాను దాదాపు 550 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. భవిష్యత్‌లో తప్పకుండా దర్శకత్వం వహిస్తాను’’ అన్నారు. -
అందుకే డైరెక్షన్ చేయకూడదనుకున్నాను: కోడి రామకృష్ణ కూతురు
‘‘నాకు దర్శకత్వం అంటే చాలా ఇష్టం. నాన్న (కోడి రామకృష్ణ) ద్వారా దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్నాను. మా ఆయన కూడా డైరెక్షన్ చేయమని ప్రోత్సహించారు. ఇంతలో నాన్న దూరమయ్యారు. దర్శకుడిగానే కాకుండా మంచి వ్యక్తిత్వంతోనూ అభిమానులను సంపాదించుకున్నారు నాన్న. అటువంటిది నేను డైరెక్షన్ చేసి ఆయన పేరు చెడగొట్టకూడదని నా నిర్ణయం మార్చుకున్నాను’’ అని నిర్మాత కోడి దివ్య దీప్తి అన్నారు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారి ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా నిర్మిస్తున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా, సంజనా ఆనంద్, సిద్ధార్థ్ మీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి దివ్య ఎంటర్టైన్ మెంట్స్‌పై రూపొందుతున్న ఈ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. నేడు (జూలై 8) కోడి దివ్య దీప్తి బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు ఉన్నప్పుడే కిరణ్‌తో సినిమా చేద్దామని కథలు విన్నాను. ‘మనం పెట్టే ప్రతి రూపాయి స్క్రీన్‌పై కనపడేలా చెయ్యాలి తప్ప వృథా చేయకూడదు’ అని నాన్న ఎప్పుడూ చెప్పేవారు.. ఆ మాటలు మనసులో పెట్టుకొని ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చేస్తున్నాను. ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 10న పాలకొల్లులో విడుదల చేస్తున్నాం. సెప్టెంబర్ 9న సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం. నాకు కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలంటే ఇష్టం. నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. నా తర్వాతి సినిమా ఏంటనేది త్వరలో చెబుతాను’’ అన్నారు.