సూర్య 'కంగువ' టీజర్‌.. కళ్లు చెదిరిపోయేలా విజువల్స్! | Kollywood Star Hero Suriya Kanguva Movie Official Teaser Out Now, Watch Video Inside - Sakshi

Suriya Kanguva Teaser: సూర్య 'కంగువ' టీజర్‌.. కళ్లు చెదిరిపోయేలా విజువల్స్!

Mar 19 2024 5:55 PM | Updated on Mar 19 2024 7:45 PM

Kollywood Star Hero Suriya Kanguva Teaser Out Now - Sakshi

సూర్య హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా కొత్త సినిమా 'కంగువ' టీజర్‌ తాజాగా విడుదల అయింది. పీరియాడికల్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. జగపతిబాబు, బాబీ డియోల్‌, యోగిబాబు, కోవై సరళ తదితరులు  పోషిస్తున్నారు. శివ దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం విడుదలైన ‘కంగువ’ టీజర్‌.. పాన్‌ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకులందరినీ మెప్పించింది. అందులో  సరికొత్త అవతారంలో ప్రేక్షకుల్ని సూర్య మెప్పించారు. తాజాగా విడుదలైన టీజర్‌ను చూస్తుంటే సూర్య నట విశ్వరూపం ఏంటో ఇండియన్‌ బాక్సాఫీస్‌కు చూపెట్టనున్నారని తెలుస్తోంది. సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న కంగువ రూ. 1000 కోట్ల కలెక్షన్స్‌ టార్గెట్‌ పెట్టుకుని బరిలోకి దిగనుంది. పార్ట్ 2, పార్ట్‌ 3 కథలు సిద్ధంగా ఉన్నాయని  నిర్మాత ధనంజయన్‌ గతంలో చెప్పారు. పార్ట్‌ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించే ప్లాన్‌ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

కంగువా టీజర్ చూస్తే విజువల్ వండర్‌గా ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేసింది. కంగువ పాత్రలో సూర్య పోరాట యోధుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. పులితో సూర్య చేసిన ఫైట్ సీక్వెన్స్ స్క్రీన్ మీదే చూడాలని అనిపించేలా ఉంది. హార్స్ ఫైటింగ్, బిగ్ షిప్ వార్ సీన్స్‌తో వరల్డ్ సినిమా హిస్టరీలోని ఎపిక్ వార్ మూవీస్‌ను ఈ టీజర్ గుర్తు చేసింది. హై క్వాలిటీ విజువల్స్‌ను దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత ఎలివేట్ చేసింది. ఉధిరన్‌తో కంగువ చేసిన రూత్‌లెస్‌.. ఫెరోషియస్ ఫైట్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం హీరో సూర్య పడిన శ్రమంతా ఆయన మేకోవర్, క్యారెక్టర్‌లో కనిపించింది. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement