అమెజాన్‌ ఫ్రైమ్‌లో ‘బిగ్‌బాస్‌’ఫేమ్‌ మానస్ ‘క్షీరసాగర మథనం’ | ksheera Sagara Madhanam Streaming on Amazon Prime | Sakshi
Sakshi News home page

అమెజాన్‌లో ‘బిగ్‌బాస్‌’ఫేమ్‌ మానస్ ‘క్షీరసాగర మథనం’

Published Thu, Sep 9 2021 2:35 PM | Last Updated on Thu, Sep 9 2021 2:39 PM

ksheera Sagara Madhanam Streaming on Amazon Prime - Sakshi

ksheera Sagara Madhanam: ‘బిగ్ బాస్‌’ఫేమ్ మానస్, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘క్షీరసాగర మథనం’.  అక్షత సోనావని ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్‌, కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా మూవీని నిర్మించాయి. ఆగస్టు 6న థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది.

కాగా ఇటీవలే అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ఈ మూవీ​కి అక్కడ కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోందని మూవీ దర్శకుడు తెలిపాడు. ప్రేక్షకుల స్పందన ఇలాగే కొనసాగుతుందని ఆయన ఆకాంక్షించారు. ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో పనిచేసే ఇరవై మంది మిత్రులు ఈ మూవీని నిర్మాణంలో భాగమైనట్లు ఆయన పేర్కొన్నాడు. ఆ ఉత్సాహంలో తన తదుపరి చిత్రం కోసం సన్నాహాలు చేసుకుంటునట్లు వెల్లడించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement