Lavanya Tripathi Happy Birthday Movie Release Preponed, Check New Release Date - Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: వారం ముందుగానే లావణ్య త్రిపాఠి 'హ్యాపీ బర్త్‌ డే'..

Published Sun, Jun 26 2022 12:27 PM | Last Updated on Sun, Jun 26 2022 1:06 PM

Lavanya Tripathi Happy Birthday Movie Preponed - Sakshi

Lavanya Tripathi Happy Birthday Movie Preponed: హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌ డే’. ఈ మూవీకి ‘మత్తు వదలరా’ ఫేమ్‌ రితేష్‌ రానా దర్శకత్వం వహించారు. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ వై. సమర్పణలో క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. ఈ చిత్రం విడుదల తేదీలో మార్పు జరిగింది.

‘హ్యాపీ బర్త్‌ డే’ని తొలుత జులై 15న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఓ వారం ముందుగానే అంటే జులై 8న రిలీజ్‌ చేయనున్నట్లు శనివారం చిత్రయూనిట్‌ ప్రకటించింది. ‘‘థ్రిల్లింగ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. సరికొత్త పాత్రలు, విభిన్న కథా నేపథ్యంతో నిర్మించిన మా సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, కెమెరా: సురేష్‌ సారంగం, లైన్‌ ప్రాడ్యూసర్‌: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బాబా సాయి, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బాల సుబ్రమణ్యం కేవీవీ.

చదవండి: 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్‌ హీరోయిన్‌..
వెబ్‌ స్క్రీన్‌పై బాగా వినిపిస్తున్న ఈ హీరోయిన్‌ గురించి తెలుసా ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement