లెజెండరీ థియేటర్ ఆర్టిస్ట్, అక్షర థియేటర్ సహ వ్యవస్థాపకురాలు జలబాల వైద్య ఇవాళ కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఆదివారం ఢిల్లీలో మరణించింది. ఈ విషయాన్ని ఆమె కుమార్తె అనసూయ వైద్య శెట్టి తెలిపారు. ప్రస్తుతం ఆమె వయసు 86 ఏళ్లు.
జలబాల వైద్య జర్నలిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఢిల్లీలోని అనేక జాతీయ వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లకు తన సేవలు అందించింది. ఆమె కళలకు చేసిన కృషికి, ఢిల్లీ ప్రభుత్వం వరిష్ట్ సమ్మాన్, సంగీత నాటక అకాడమీ ఠాగూర్ అవార్డు, ఢిల్లీ నాట్య సంఘం అవార్డు, ఆంధ్రప్రదేశ్ నాట్య అకాడమీ అవార్డులు అందుకుంది. ఆమె నటన జీవితం 1968లో 'ఫుల్ సర్కిల్'తో ప్రారంభమైంది.
ఫుల్ సర్కిల్‌కి విమర్శకుల ప్రశంసలు రావడంతో రాయల్ షేక్స్‌పియర్ వరల్డ్ థియేటర్ సీజన్ కోసం ది రామాయణం ఆధారంగా ఒక కథను రాసి శర్మన్ దర్శకత్వం వహించారు. శర్మన్ ఈ సినిమా కోసం 25 మంది నటీనటులు కావాలని కోరారు. అయితే ఇందులో జలబాల వైద్య అన్ని పాత్రలను పోషించి.. ఒక మహిళగా అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకుంది. ఆమె 'ఫుల్ సర్కిల్', 'ది రామాయణం', 'లెట్స్' వంటి 20కి పైగా చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించింది. 'ది భగవద్గీత', 'ది కాబూలీవాలా', 'గీతాంజలి', 'ది స్ట్రేంజ్ కేస్ ఆఫ్ బిల్లీ బిస్వాస్ సినిమాల్లో కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment