Mahesh Babu Family Lands In Dubai, Set To Start Sarkaru Vaari Paata Movie Shooting - Sakshi
Sakshi News home page

‘సర్కారు వారి పాట’ కోసం దుబాయ్‌ ఛలో

Published Fri, Jan 22 2021 11:20 AM | Last Updated on Fri, Jan 22 2021 3:15 PM

Mahesh Babu Off To Dubai With Family For Movie Shooting - Sakshi

‘సర్కారు వారి పాట’ చిత్రీకరణను షురూ చేయడానికి మహేశ్‌ బాబు సిద్ధమయ్యారు. దుబాయ్‌ ప్రయాణం అయ్యారు కూడా. వచ్చే వారం నుంచి దుబాయ్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కీర్తీ సురేశ్‌ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ 26న దుబాయ్‌లో ప్రారంభం కానుంది. కుటుంబంతో కలసి దుబాయ్‌ ప్రయాణం అయ్యారు మహేశ్‌బాబు. కోవిడ్‌ తర్వాత తొలిసారి సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు మహేశ్‌. ఇవాళ నమ్రత పుట్టిన రోజు. దుబాయ్‌లో బర్త్‌డేని సెలబ్రేట్‌ చేసుకున్నారు. 


చదవండి:
నేను ఎంతో ప్రేమించే వ్యక్తి పుట్టినరోజు నేడు: మహేష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement