ప్రతి ఏడాది వేసవిలో కుటుంబంతో కలిసి వెకేషన్ కోసం విదేశాలకు వెళ్తుంటారు హీరో మహేశ్ బాబు. ఈ ఏడాది కూడా వెళ్లనున్నారాయన. ఈ నెల మొదటి వారంలోనే మహేశ్ బాబు వెకేషన్ మోడ్ ఆన్ కానుంది. ఇప్పటికే ఆయన సతీమణి నమ్రత, పిల్లలు విదేశాల్లోనే ఉన్నారని, అతి త్వరలో మహేశ్ కూడా ఫ్యామిలీతో జాయిన్ అవుతారని సమాచారం.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను హీరోగా నటిస్తున్న సినిమాషూటింగ్‌తో బిజీగా ఉన్నారు మహేశ్ బాబు. మరో మూడు, నాలుగు రోజులు ఈ షూట్‌లో పాల్గొన్న తర్వాత ఫారిన్ ఫ్లైట్ ఎక్కనున్నారాయన. ఈ నెలాఖరున హైదరాబాద్‌కు తిరిగొచ్చి మళ్లీ షూటింగ్‌లో జాయిన్ అవుతారు. ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా 2024, జనవరి 13న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment