ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మహేశ్‌బాబు, హృతిక్ రోషన్ స్టార్‌డమ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటిది ఈ ఇద్దరూ స్క్రీన్‌న్ షేర్ చేసుకుంటే ఈ ఇద్దరి హీరోల అభిమానులకు పండగే. ఆ ప్రాజెక్ట్ ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. మహేశ్, హృతిక్ కలిసి ఓ సినిమా చేయనున్నారనే టాక్ ఇప్పుడు బీ టౌన్‌లో బలంగా వినిపిస్తోంది. రామాయణం ఆధారంగా ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి, ‘మామ్’ ఫేమ్ రవి ఉడయార్ సంయుక్త దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రకటన వచ్చింది.
అప్పటి ప్రకటన ప్రకారం ఈ త్రీడీ రామాయణానికి అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా, మధు మంతెన నిర్మాతలు. ఏడాది క్రితం ఈ సినిమా ప్రీ ప్రొడక్ష¯Œ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈ సినిమా గురించిన అప్‌డేట్స్ పెద్దగా తెరపైకి రాలేదు. రామాయణం బ్యాక్‌డ్రాప్‌లో ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాను ఎనౌన్స్ చేయడమే ఇందుకు కారణం అనే టాక్ బాలీవుడ్‌లో వినిపించింది. కానీ అలాంటిది ఏమీ లేదని.. నితీష్, రవి ఉడయార్ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తూనే ఉన్నారని... ఈ సినిమాను మూడు భాగాలుగా తీయాలనుకుంటున్నారని బీ టౌన్‌లో ఇప్పుడు చెప్పుకుంటున్నారు. అంతేకాదు... ఈ సినిమాలోని రాముడి పాత్రకు మహేశ్‌బాబును, రావణుడి పాత్రకు హృతిక్ రోషన్‌ను సంప్రదించారట దర్శకుడు నితీష్. మరి... మహేశ్, హృతిక్ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? వెయిట్ అండ్ సీ.
చదవండి:
అక్షయ్ కుమార్ క్షేమంగా ఉన్నారు : ట్వింకిల్ ఖన్నా
కరోనా కలకలం: దిల్ రాజు ఎంత పనిచేశావ్..
Comments
Please login to add a commentAdd a comment