రివేంజ్ డ్రామాగా  'మ‌ల్లెతీగ' ప్రారంభం | Malletheega Movie Motion Poster Released | Sakshi
Sakshi News home page

Malletheega Movie Motion Poster Released: రివేంజ్ డ్రామాగా  'మ‌ల్లెతీగ' ప్రారంభం

Published Fri, Nov 19 2021 7:52 PM | Last Updated on Fri, Nov 19 2021 7:52 PM

Malletheega Movie Motion Poster Released - Sakshi

రివేంజ్‌ డ్రామాగా తెరకెక్కుతున్న 'మల్లెతీగ' సినిమా మోషన్‌ పోస‍్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. శ్రీ నందనం క్రియేషన్స్ పతాకంపై జైరాజ్ జల్లూరి, ప్రవీణ్ పోతురాజు, సిమ్రాన్, హన్సిక శ్రీనివాస్, సుజాత, భరత్, చందు ప్రధాన పాత్రల్లో పల్లి మోహన్ రావు దర్శకత్వంలో శ్రీను మోచర్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. ప్రముఖ దర్శకుడు సముద్ర హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నటుడు నిర్మాత డి.యస్. రావు చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. 

అంతా కొత్త వాళ్లతో విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో చేస్తున్న ఈ "మల్లెతీగ" సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న​​​ట్లు నిర్మాత డి.యస్‌. రావు తెలిపారు. 'ఈ చిత్ర మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ఈ 'మల్లె తీగ' చిత్రం ఎర్ర మల్లెలు అంత పెద్ద హిట్ అవ్వాలి. మంచి కథను సెలెక్ట్ చేసుకొని నిర్మిస్తున్న దర్శక, నిర్మాతలకు ఈ సినిమా గొప్ప విజయం సాధించాల'ని దర్శకుడు సముద్ర అన్నారు. దర్శకుడు చెప్పిన కథ చాలా కొత్తగా అనిపించిందని చిత్ర నిర్మాత శ్రీను మోచర్ల పేర్కొన్నారు. ట్రైబల్ ఏరియాలో ఉన్న ఒక గ్రామంలో చిత్రీకరణ జరుపుకుంటుందన్నారు. కొత్తవారితో చేస్తున్న తమ సినిమాను ప్రేక్షకులందరూ కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉందన‍్నారు. 

చిత్ర దర్శకుడు పల్లి మోహన్ రావు మాట్లాడుతూ 'ఇది నా మొదటి చిత్రం. రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథే హీరో. ఇందులో నటించిన హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు కేవలం కథకు ప్రాణం పోస్తారు. వైజాగ్ దగ్గర గుడివాడ పరిసర ప్రాంతంలో ఉన్న ఈ విలేజ్ ఎక్కడా మ్యాప్‌లో కూడా లేదు. గవర్నమెంట్ అండర్‌లో లేని ఈ విలేజ్‌కు సెట్ కూడా అవసరం లేదు. ఇది పూర్తి ట్రైబల్‌లో ఉన్న ఈ  గ్రామాన్నిసెలెక్ట్ చేసుకొని షూటింగ్ చేస్తున్నాం.ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన నిర్మాత శ్రీను మోచర్లకు కృతజ్ఞతలు.' అని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement