Fan Accuses Kriti Sanon Of Spoiling Life, See Actress Shocking Reaction - Sakshi
Sakshi News home page

Kriti Sanon: తన జీవితం నాశనమైందని హీరోయిన్‌కు ట్వీట్‌! రిప్లై ఏంటో తెలుసా!

Published Wed, Dec 1 2021 9:31 PM | Last Updated on Thu, Dec 2 2021 10:39 AM

Man Says Kriti Sanon Ruined His Life Over Param Sundari Song - Sakshi

బాలీవుడ్ సెలబ్రెటీలు ఎక్కువసార్లు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురవతారు! నెటిజన్లు కూడా అడగరాని ప్రశ్నలు అడిగి ముఖ్యంగా హీరోయిన్లుకు ఆగ్రహం తెప్పిస్తారు. అయితే హీరోయిన్లు కూడా తమదైన శైలిలో సమాదానం చెప్పి అకతాయి నెటిజన్ల నోర్లు మూయించిన వార్తలు చూశాం. తాజాగా నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతిససన్ నవ్వు ఆపుకోలేకపోయారు.

దానిగల కారణం.. కృతిసనన్‌ నటించిన ‘మిమీ’ చిత్రంలోని ‘పరం సుందరి’ పాట. ఈ పాట ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ పాటను అభిమానులు తెగ పాడుకుంటున్నారు. అయితే ‘పరం సందరి’పాట విడుదలైప్పటీ నుంచి తన స్నేహితులు తీవ్రంగా ఆటపట్టిస్తున్నారని  ఓ ట్విటర్‌ యూజర్‌ కృతిసనన్‌కు ట్వీట్‌ చేశాడు. ‘పరం ఛాయా’ అనే ఓ ట్విటర్‌ యూజర్‌ నవంబర్‌ 25న చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

‘చిన్నప్పుడు స్కూల్‌లో ఏదీ నన్ను ఇబ్బంది పెట్టలేదు. నా ఇంటిపేరు, నా పేరును ఆటపట్టించిన వారిపై నాకు కోపం లేదు. కానీ హీరోయిన్‌ కృతి సనన్ ‘పరమ సుందరి’ విడుదలైనప్పటి నుంచి నేను ఇప్పటికే కనీసం 1000 సార్లు వేధించబడ్డాను. ఎందుకు ఇలా చేశావు కృతిసనన్‌.. నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు’ అని ట్విట్‌లో పేర్కొన్నాడు. దీనికి ‘నవ్వే ఎమోజీలతో అయ్యో!! సారీ’ అని కృతి సనన్‌ రిప్లై ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన పరమ సుందరి పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంది. ఈ పాటను శ్రేయా ఘోషల్ పాడగా.. ఏఆర్ రెహమాన్ కంపోజ్‌ చేశారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన మిమీ చిత్రంలో కృతి సనన్‌ ‘గర్భం దాల్చే’ సరోగసి తల్లిగా నటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement