Manchu Viranica Enters Into Bridal Collection Business - Sakshi
Sakshi News home page

Manchu Viranica: విరానిక బ్రైడల్‌ కలెక్షన్స్‌.. మృణాల్‌ కట్టిన చీరను రెడీ చేయడానికి వెయ్యి గంటలా!

Published Sun, Jan 22 2023 1:41 PM | Last Updated on Sun, Jan 22 2023 3:03 PM

Manchu Viranica Enters Into Bridal Collection Business - Sakshi

హీరో మంచు విష్ణు సతీమణి విరానిక ఎంటర్‌ప్రెన్యూర్‌ అన్న విషయం తెలిసిందే! ఓ పక్క నలుగురు పిల్లలను చూసుకుంటూనే మరో పక్క ద కేక్‌ రూమ్‌ పేరిట కస్టమైజ్డ్‌ కేక్స్‌ బిజినెస్‌ నడుపుతూ, న్యూయార్క్‌ అకాడమీ స్కూల్‌ బాధ్యతలు చూసుకుంటోంది. న్యూయార్క్‌ యూనివర్సిటీ నుంచి ఫ్యాషన్‌ మార్కెటింగ్‌లో శిక్షణ తీసుకున్న ఆమె మైసన్‌ అవా పేరుతో క్లాతింగ్‌ బిజినెస్‌ సైతం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో 2023కి వెల్‌కమ్‌ చెప్తూ విరానిక పేరుతో బ్రైడల్‌ డిజైనర్‌వేర్‌ను ప్రారంభించింది మంచు కోడలు. తాజాగా సీతారామం హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ విరానికా బ్రాండ్‌కు చెందిన సారీ ధరించింది. మల్లెపూవులాంటి తెల్ల చీరలో ధగధగ వెలిగిపోయింది మృణాల్‌.

ఈ ఫోటోలను విరానికా బ్రాండ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. మృణాల్‌ ధరించిన జరీ గోల్డ్‌ టిష్యూ కాంచీవరం చీరను తయారు చేయడానికి వారికి 980 గంటలు పట్టిందట. అంటే ఒక్క చీర కోసం దాదాపు రెండున్నర నెలలకు పైగా సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ బ్రాండ్‌ను రిలీజ్‌ చేశాక విరానిక సైతం తెల్ల చీరలో మెరిసిపోతున్న ఫోటో ఒకటి షేర్‌ చేసింది. 18 మీటర్ల పొడవున్న ఆ చీరను రెడీ చేయడానికి ఏకంగా 1860 గంటలు కష్టపడ్డారట. ఒక్క చీరను తయారు చేయడానికే నెలల తరబడి కష్టపడ్డారంటే దాని ఖరీదు ఓ రేంజ్‌లో ఉండటం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

చదవండి: రామ్‌చరణ్‌ పిలిస్తే కచ్చితంగా వస్తా: షారుక్‌
ఆర్‌ఆర్‌ఆర్‌ బాలీవుడ్‌ మూవీ అన్న నటి.. ఓ రేంజ్‌లో క్లాస్‌ పీకిన నెటిజన్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement