రవితేజ మనసు బంగారం, ఇదే అందుకు నిదర్శనం! | Mass Maharaja Ravi Teja Sweet Gesture Towards Elderly Women In Karampudi | Sakshi
Sakshi News home page

Ravi Teja: మాస్‌ మహారాజ మనసు బంగారం.. ఇంతకీ ఏం చేశాడంటే?

Published Sun, Feb 4 2024 1:37 PM | Last Updated on Sun, Feb 4 2024 2:55 PM

Mass Maharaja Ravi Teja Sweet Gesture Towards Elderly Women In Karampudi - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ సినిమాల్లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ ఎంతో సరదాగా ఉంటాడు. మనసులో ఏదీ పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు. ఎంతోమంది దర్శకులకు లైఫ్‌ ఇచ్చాడు. అభిమానులను కూడా తన సొంత ఫ్యామిలీగా భావిస్తాడు. ఇతడు ప్రస్తుతం డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌తో కలిసి మిస్టర్‌ బచ్చన్‌ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌ కారంపూడిలో జరిగింది. ఆ సమయంలో కారంపూడికి వెకేషన్‌కు వెళ్లిన 70 ఏళ్లు పైబడ్డ వృద్ధ మహిళలు రవితేజను చూడాలనుందని మిస్టర్‌ బచ్చన్‌ టీమ్‌ను అడిగారట!

బామ్మల కోరికకు ఓకే
ఈ విషయాన్ని రవితేజకు చేరవేయగా ఆయన వారిని కలిసేందుకు రెడీ అయ్యాడు. షూటింగ్‌ అయిపోయిన మరుసటి రోజు రాత్రి ఏకంగా వారు ఉంటున్న చోటుకు వెళ్లాడు. అప్పుడు వారు భోజనం చేస్తుండటంతో డిన్నర్‌ అయిపోయేవరకు డిస్టర్బ్‌ చేయకుండా ఓపికగా అక్కడే వెయిట్‌ చేశాడు. తర్వాత వారితో కలిసి ఫోటోలు దిగాడు. తమ భోజనం అయ్యేంతవరకు రవితేజ వెయిట్‌ చేశాడని తెలిసి బామ్మలు సంతోషంతో ఉప్పొంగిపోయారు.

మర్చిపోలేని జ్ఞాపకంగా..
ఇంతకీ బామ్మల డిన్నర్‌ అయ్యేంతవరకు ఎందుకు ఎదురుచూడటం? అని టీమ్‌ అడగ్గా.. వారు సీనియర్‌ సిటిజన్లు.. వారి కోసం నేను వెయిట్‌ చేసిన క్షణాలు ఆ వృద్ధుల జీవితంలోనే మరిచిపోలేని క్షణాలుగా మిగిలిపోతాయి అని బదులిచ్చాడట! రవితేజ మనసు బంగారం అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది!

చదవండి:  ఎదురుచూపులకు బ్రేక్‌.. 19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి సూపర్‌ హిట్‌ మూవీ
భర్త ప్రోత్సాహంతోనే ఆ సీన్‌లో అలా నటించా: శరణ్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement