karempudi
-
టీడీపీ దాడిపై వైఎస్సార్సీపీ సర్పంచ్ ఆవేదన
-
సీఐ నారాయణస్వామిపై ఈసీ చర్యలు
-
టీడీపీ గూండాల విధ్వంసం.. వీడియోలు వైరల్
-
రవితేజ మనసు బంగారం, ఇదే అందుకు నిదర్శనం!
మాస్ మహారాజ రవితేజ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఎంతో సరదాగా ఉంటాడు. మనసులో ఏదీ పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు. ఎంతోమంది దర్శకులకు లైఫ్ ఇచ్చాడు. అభిమానులను కూడా తన సొంత ఫ్యామిలీగా భావిస్తాడు. ఇతడు ప్రస్తుతం డైరెక్టర్ హరీశ్ శంకర్‌తో కలిసి మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ కారంపూడిలో జరిగింది. ఆ సమయంలో కారంపూడికి వెకేషన్‌కు వెళ్లిన 70 ఏళ్లు పైబడ్డ వృద్ధ మహిళలు రవితేజను చూడాలనుందని మిస్టర్ బచ్చన్ టీమ్‌ను అడిగారట! బామ్మల కోరికకు ఓకే ఈ విషయాన్ని రవితేజకు చేరవేయగా ఆయన వారిని కలిసేందుకు రెడీ అయ్యాడు. షూటింగ్ అయిపోయిన మరుసటి రోజు రాత్రి ఏకంగా వారు ఉంటున్న చోటుకు వెళ్లాడు. అప్పుడు వారు భోజనం చేస్తుండటంతో డిన్నర్ అయిపోయేవరకు డిస్టర్బ్ చేయకుండా ఓపికగా అక్కడే వెయిట్ చేశాడు. తర్వాత వారితో కలిసి ఫోటోలు దిగాడు. తమ భోజనం అయ్యేంతవరకు రవితేజ వెయిట్ చేశాడని తెలిసి బామ్మలు సంతోషంతో ఉప్పొంగిపోయారు. మర్చిపోలేని జ్ఞాపకంగా.. ఇంతకీ బామ్మల డిన్నర్ అయ్యేంతవరకు ఎందుకు ఎదురుచూడటం? అని టీమ్ అడగ్గా.. వారు సీనియర్ సిటిజన్లు.. వారి కోసం నేను వెయిట్ చేసిన క్షణాలు ఆ వృద్ధుల జీవితంలోనే మరిచిపోలేని క్షణాలుగా మిగిలిపోతాయి అని బదులిచ్చాడట! రవితేజ మనసు బంగారం అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది! 70+ elderly women who came on vacation asked the team whether there would be any chance to meet Ravi Teja. The actor who came to know about it went to their place, after the shoot yesterday. He waited till they completed their dinner and then posed for a photograph with them. pic.twitter.com/K5ZDXEZvQd — Trends Raviteja™ (@trends4raviteja) February 1, 2024 చదవండి: ఎదురుచూపులకు బ్రేక్.. 19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ భర్త ప్రోత్సాహంతోనే ఆ సీన్లో అలా నటించా: శరణ్య -
బ్యాంక్ ఉద్యోగి చేతివాటం.. రూ.కోటికి పైగా బ్యాంకు సొమ్ము మాయం
కారంపూడి(మాచర్ల): కారంపూడి ఎస్బీఐ బ్రాంచ్ ఉద్యోగి ఒకరు సుమారు కోటి రూపాయలు బ్యాంకు సొమ్ము స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బ్యాంకులో గోల్డ్ లోన్ అధికారిగా పనిచేస్తున్న సేవ్యానాయక్ ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గత నాలుగో తేదీ ఒక ఫేక్ అకౌంట్ ద్వారా నగదు స్వాహా విషయాన్ని గుర్తించిన బ్యాంక్ చీఫ్ మేనేజర్ అప్రమత్తమై పై అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆర్బీఐ టీం, రీజినల్ ఆఫీస్ అధికారులు రంగంలోకి దిగి శోధించడంతో నగదు స్వాహా పర్వం వెలుగు చూసింది. గత మూడు నెలలుగా బ్యాంకు ఏటీఎంలలో పెట్టడానికి బ్యాంకు నుంచి తీసుకెళ్లిన నగదులో కొంత స్వాహా చేస్తూ మిగతాది ఏటీఎం మిషన్లలో పెడుతూ సేవ్యానాయక్ నగదు స్వాహాకు పాల్పడ్డాడు. చదవండి: భక్తుడిలా రెక్కీ .. రాత్రికి చోరీ! ఇలా మూడు నెలల కాలంలో సుమారు రూ.కోటికి పైగా దారి మళ్లించాడు. క్రికెట్ బెట్టింగులకు బానిసగా మారిన సేవ్యానాయక్ బ్యాంకు సొమ్ముతో క్రికెట్ బెట్టింగులు ఆడాడంటున్నారు. అయితే ఇతని స్వాహా పర్వాన్ని అధికారులు గత నాలుగో తేదీనే గుర్తించి, ఖాతాలన్నింటినీ జల్లెడ పట్టి ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకున్నారు. సేవ్యానాయక్‌ను సస్పెండ్ చేశారు. అయితే ఈ ఘటనపై వివరణ ఇవ్వడానికి బ్యాంకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. -
గుంటూరు జిల్లాలో దారుణం
కారంపుడి: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పుతిరిగి చెల్లించలేదని ఓ కుటుంబంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాలోని కారంపుడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబంపై ఆర్థిక లావాదేవీల విషయంలో కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పండుగ పూట విషాదం
కారంపూడి : సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు స్వగ్రామానికి వెళ్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి వాగులో పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం వేకువజామున కారంపూడి సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన గోళ్ళపాటి శ్యాంసన్, లుథియారాణి దంపతులు, మరికొందరు బంధువులు ఉపాధి కోసం ఎనిమిది నెలల క్రితం హైదరాబాద్‌కు వెళ్లారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసం ఉంటూ తాపీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. శ్యాంసన్ బావ పల్లెపోగు చిన్నిరామయ్య సంక్రాంతి పండుగ కోసం వీరందరినీ తన కారులో స్వగ్రామానికి తీసుకొస్తున్నాడు. కారంపూడికి మూడు కిలోమీటర్ల దూరం లో ఉన్న మంత్రాలమ్మ కనుమ మూల మలుపు వద్ద బుధవారం వేకువజామున 4.30 గంటల సమయంలో కారు అదుపు తప్పింది. రోడ్డు రెయిలింగ్‌ను ఢీకొని నాగులేరు వాగు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో లూథియారాణి(26) అక్కడికక్కడే మృతి చెందింది. భర్త శ్యాంసన్, డ్రైవింగ్ చేస్తున్న చిన్నిరామయ్య, గోళ్ళ జర్సీసాలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మృతురాలి కుమారులు ప్రవీణ్, నవీన్, సోదరుడు గంధం యల్లమంద, మరిది గోళ్లపాటి పౌలు గాయపడ్డారు. గాయపడిన వారిని 108లో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్యాంసన్ పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన వారికి ప్రాణాపాయం లేదని సమాచారం. ఎస్ఐ రమేష్‌బాబు సిబ్బంది తో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గురజాల తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. గంటన్నర పాటు మృత్యువుతో పోరాటం.. ప్రమాదం వేకువజామున 4.30 గంటలకు జరిగితే 6 గంటలకు 108 సిబ్బందికి సమాచారం అందింది. మంచు కమ్ముకుని ఉండటం, లోయ అంతా కంప చెట్లతో నిండి ఉండటంతో బయటకు రావడానికి దారి లేదు. దీంతో అటుగా వెళ్లే వారికి సైతం ప్రమాద విషయం తెలియలేదు. ఈ నేపథ్యంలో బాధితులు గంటన్నర పాటు అలాగే ఉండిపోయారు. తెల్లవారాక సమాచారం తెలిసి 108 సిబ్బంది, పోలీసుల సహకారంతో నిచ్చెన వేసుకుని కిందకు దిగి, బాధితులను ఆసుపత్రికి తరలించారు. లుథియారాణి కూడా అర గంటపాటు ప్రాణాలతోనే వుందని, సకాలంలో ఆసుపత్రికి చేరి ఉంటే బతికేదేమోనని బాధితులు తెలిపారు. -
మరో వైఎస్ఆర్ సీపీ కార్యకర్త దారుణ హత్య
గుంటూరు: గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. జిల్లాలోని కారంపూడి మండలం చిన్నగార్లపాడులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గోవిందరెడ్డిపై పచ్చపార్టీ కార్యకర్తలు కత్తులు, గోడ్డళ్లతో దాడి చేశారు. ఆ దాడిలో గోవిందరెడ్డి రక్తపు మడుగులో కుప్పకూలిపోయి... అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం పచ్చ పార్టీ కార్యకర్తలు అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ ఘటన గోవిందరెడ్డి ఇంటి ముందే చోటు చేసుకుంది. దాంతో మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు గోవిందరెడ్డి మృతదేహం వద్ద కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు ఎవ్వరూ అటు వైపునకు రాకపోవడం గమనార్హం. గోవిందరెడ్డి హత్యతో జిల్లాలో టీడీపీ కార్యకర్తలు చేసిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల హత్యల సంఖ్య ఆరుకు చేరుకుంది.